దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఉదంతం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో కృష్ణ అనే యువకుడిని కొందరు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. అతడికి కిందపడేసి, బెల్ట్ లు, కర్రలతో అతి దారుణంగా కొట్టారు. ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు. అయితే, గతంలో హోలీ పండుగ సమయంలో సూరజ్ అనే యువకుడికి, కృష్ణా కు మధ్య గొడవ జరిగింది. అప్పటి పగను మనసులో పెట్టుకుని ఏప్రిల్ 23 న దబ్రీ ప్రాంతంలో సూరజ్ తన మిత్రులతో కలిసి కృష్ణ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.
అతను అపస్మారక స్థితిలోనికి వెళ్లాక.. అతడిని వదిలేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు కృష్ణను దీన్ దయాళ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత.. చికిత్స పొందుతూ.. మూడు రోజుల తర్వాత.. ఏప్రిల్ 26 న మృతి చెందాడు. కాగా, ఈ ఘటనపై గతంలో ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాగా, తాజాగా, వీడియో వెలుగులోనికి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.
ప్రస్తుతం ఒక లాయర్ (Advocate attack on woman) మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh) షాడోల్ జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. 23 ఏళ్ల భారతీ పటేల్ అనే మహిళ తన భర్తతో వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. భర్త తరపు కేసును భగవాన్ సింగ్ (58) ఏళ్ల లాయర్ వాదిస్తున్నాడు. అయితే, ఆమె తన భర్త నుంచి న్యాయపరంగా రావాల్సిన భరణం విషయంలో కోర్టులో కేసు వేసింది. దీంతో వీరి మధ్య కేసు నడుస్తోంది.
బాధితురాలు భారతీ పటేల్ కోర్టుకు వచ్చింది. దీంతో లాయర్ భగవాన్ సింగ్ ఆమెను చూసి నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా.. ఆమె డ్రెస్ పట్టుకుని లాగాడు. మహిళ అని కూడా చూడకుండా.. కోర్టు ఆవరణలో పరిగెత్తించి, పరిగెత్తించి కొట్టాడు. (Advocate brutally attack on woman) ఆ మహిళ పై లాయర్ దాడిచేస్తుంటే.. ఏ ఒక్కరు కూడా ఆపడానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు లాయర్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.