వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...

Delhi Crime : ఐదు రోజుల కిందట ఆ లవర్స్‌పై యాసిడ్ ఎటాక్ జరిగింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు... యాసిడ్ దాడి చేసింది యువతేనని తేల్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 11:39 AM IST
వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఢిల్లీలోని వికాస్‌పురి. 19 ఏళ్ల శాన్వీ (పేరు మార్చాం)... 24 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌తో బైక్‌పై వెళ్తోంది. ఆ సమయంలో ఆ రోడ్డుపై జనం లేరు. సడెన్‌గా ఆమె తన బ్యాగ్ లోంచీ యాసిడ్ లాంటి ద్రావకం ఉన్న బాటిల్ బయటకు తీసింది. అతని మొహంపై చల్లింది. వెంటనే తనపైనా చల్లుకుంది. ఇద్దరికీ గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరారు. కేసు నమోదు చేసిన పోలీసులు... లవర్స్‌పై యాసిడ్ దాడి చేసింది ఎవరై ఉంటారు అని తీగ లాగడం మొదలుపెట్టారు. ఆమె చూడటానికి చాలా అందమైన అమ్మాయి కావడంతో... ఆమె అతనితో వెళ్లడం ఇష్టం లేని ఎవరో ఈ ఎటాక్ చేసి ఉంటారని పోలీసులు అంచనాకి వచ్చారు. అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రశ్నలు అడగాలని అనుకున్నారు.

ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తర్వాత అతను కోలుకున్నాడు. అతని ముఖం, మెడ, రొమ్ము భాగాల్లో యాసిడ్ గాయాలయ్యాయి. అయినప్పటికీ, అతని స్టేట్‌మెంట్ నమోదు చెయ్యవచ్చని డాక్టర్లు చెప్పడంతో... ఆ రోజు ఏం జరిగిందని అతన్ని అడిగారు. ఏం జరిగిందో చెప్పాడు. దాడి ఎవరు చేశారో తనకు తెలియదన్నాడు. శాన్వీకి కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనీ... వాళ్లలో ఎవరైనా ఈ దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు ఆ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

తర్వాత ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమెకు మరీ ఎక్కువ గాయాలేమీ కాలేదు. ఆమెను కూడా ఆ రోజు ఏం జరిగిందని అడిగారు. ఏం జరిగిందో చెప్పింది. అదీ రికార్డ్ చేశారు. ఇద్దరూ దాదాపు ఒకేలా చెప్పినా... చిన్న చిన్న విషయాల్లో మాత్రం ఇద్దరి స్టేట్‌మెంట్లూ వేరువేరుగా ఉన్నాయి. అవేవీ ఈ కేసు మిస్టరీని ఛేదించలేకపోయాయి.

ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల్ని చెక్ చేశారు. దురదృష్టం కొద్దీ... ఆ ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా విరిగిపోయి ఉంది. అది నెల రోజుల నుంచీ పనిచెయ్యట్లేదని తెలిసింది. అందువల్ల మిస్టరీ వీడుతుందని అనుకున్న ఎవిడెన్స్ కాస్తా లేనట్లైంది.

మిస్టరీ ఎలా ఛేదించాలా అని ఆలోచిస్తున్న ఎస్సైకి ఓ డౌట్ వచ్చింది. బైక్‌పై వెళ్తున్నప్పుడు అతడు... ఘటన జరిగిన ప్రాంతానికి ముందు ఉన్న సీసీ కెమెరాల్లో తలకు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఘటన జరిగినప్పుడు మాత్రం తలకు హెల్మెట్ లేదు. అందువల్లే తలపైనా యాసిడ్ పడింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు మళ్లీ అతన్ని కలిశారు.

యాసిడ్ దాడికి ఐదు నిమిషాల ముందు... శాన్వీయే హెల్మెట్ తల నుంచీ తీసేయమని అందని చెప్పాడు. హెల్మెట్ ఉంటే తనతో మాట్లాడటం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో... హెల్మెట్ తీసేశానని పోలీసులకు వివరించాడు. అంతే... పోలీసులకు డౌట్ వచ్చేసింది. కట్ చేస్తే... శాన్వీని నిలదీశారు. నిజం చెప్పింది. తనే యాసిడ్ దాడి చేశానని చెప్పింది. ఎందుకు అని అడిగితే... అసలు విషయం చెప్పింది.

ఏం జరిగిందంటే : అతనూ, శాన్వీ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుందామని శాన్వీ చెబితే... సరే అనకుండా నాటకాలాడుతున్నాడు. అతని వాలకం చూశాక... ఆమెకు డౌట్ వచ్చింది. పెళ్లి అనే సరికి జారుకుంటున్నాడనీ, సరిగా మాట్లాడటం కూడా మానేశాడనీ, వేరే అమ్మాయికి దగ్గరైనట్టున్నాడని భావించింది. ఎట్టి పరిస్థితుల్లో అతను తననే పెళ్లి చేసుకోవాలని బలంగా డిసైడైంది. అందుకు యాసిడ్ ఎటాక్ చేస్తే... చచ్చినట్లు తననే చేసుకుంటానని నమ్మింది. ఓ షాపులో బాత్‌రూం క్లీనింగ్ బాటిల్ (యాసిడ్ లాంటిది) కొని బ్యాగులో పెట్టుకుంది. బైక్‌పై వెళ్లిన రోజున తనే అత్యంత తెలివిగా దాడి చేసింది. ఇలా కేసును ఛేదించిన పోలీసులు... ఆమెను అరెస్టు చేశారు.
First published: June 17, 2019, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading