• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • OLDAGE COUPLE COMMITS SUICIDE IN BHADRADRI KOTHAGUDEM DISTRICT VB KMM

ముదిమి వయస్సులో బతుకుపై విరక్తి.. ‘ఆ నలుగురు’ ఉన్నా ఆలనా పాలన కరువు.. చివరకు ఆ వృద్ధ దంపతులు..

ముదిమి వయస్సులో బతుకుపై విరక్తి.. ‘ఆ నలుగురు’ ఉన్నా ఆలనా పాలన కరువు.. చివరకు ఆ వృద్ధ దంపతులు..

ఉరేసుకొని చనిపోయిన వృద్ధులు

పిల్లలున్నా చూసే వాళ్లు లేక మానసికంగా కుంగిపోతూ కాలం గడుపుతున్నవారు కొందరు. అయిన వాళ్లెవరూ లేక అనాధల్లా జీవితాల్ని సాగిస్తున్నవారు మరికొందరు. ముదిమి వయసులో పలకరించే వారు లేరని పట్టెడన్నం పెట్టే వారు లేరని దిగులు చెందారు ఆ వృద్ధ దంపతులు. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • Share this:
    పిల్లలున్నా చూసే వాళ్లు లేక మానసికంగా కుంగిపోతూ కాలం గడుపుతున్నవారు కొందరు. అయిన వాళ్లెవరూ లేక అనాధల్లా జీవితాల్ని సాగిస్తున్నవారు మరికొందరు. ముదిమి వయసులో పలకరించే వారు లేరని పట్టెడన్నం పెట్టే వారు లేరని దిగులు చెందారు ఆ వృద్ధ దంపతులు. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వృద్ధాప్యంలో అయిన వాళ్లు సరిగ్గా చూడక పండుటాకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వంటరి తనంతో మానసిక వేధన భరించలేక కొందరు.. వయస్సు మీద పడి మరి కొందరు.. మిగతావారికి భారం కాకూడదని మరి కొందరు ఆత్మహ్యత్యలే శరణ్యమని భావిస్తున్నారు. ఇటీవల రాష్ర్టంలో వరుసగా వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటలను చాలా వరకు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన ఘటనలు మరువకముందే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

    దమ్మపేట మండలం పట్వారీ గూడెంకు చెందిన వృద్ధ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మానసికంగా కుంగి పోయి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారీ గూడెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ద దంపతులు అర్ధరాత్రి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో కలకలం సృష్టించింది. ఎస్సై వరుణ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) దంపతులు కుమారులతో కాకుండా వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే, వారు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నా కుమారులు పట్టించుకోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో.. వారి ఇంటి పక్కన ఉంటున్న వారు అనుమానం వచ్చి చూశారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే వృద్ధులు మృతి చెందారు. అనంతరం గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దమ్మపేట పోలీసులు వెల్లడించారు. కాగా.. వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో కలకలం సృష్టించింది.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు