Home /News /crime /

OLD MAN RAPES GRANDDAUGHTER FOR ONE YEARIN NAGPUR PVN

Shocking : సొంత మనవరాలిపైనే కన్నేసిన తాత..భయపెట్టి పలుమార్లు అత్యాచారం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Old man rapes granddaughter : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.

ఇంకా చదవండి ...
Old man rapes granddaughter : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా సొంత మనమరాలిపైనే(Granddaughter) అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాత. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్​పుర్​లోని కపిల్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

నాగ్ పూర్(Nagpur) లోని కపిల్ నగర్ పోలీస్ ఏరియాలో మానిక్ చంద్ బిందేశ్వరి సింగ్ (62)అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే మానిక్ చంద్ కూతురు గతేడాది గర్భంతో పుట్టింటికి వచ్చింది. అయితే ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో ఆమె తరచుగా హాస్పిటల్ కు వెళ్తుండేది. ఈ సమయంలో తన 13 ఏళ్ల కూతురిని తన తండ్రి వద్ద వదిలి వెళ్తుండేది. అయితే సొంత మనవరాలిపైనే మానిక్ చంద్ కన్ను పడింది. తన కూతురు హాస్సిటల్ కి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న తన మనవరాలిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇలా ఏప్రిల్ 13,2021 నుంచి మే 18, 2022 మధ్య కాలంలో పలుమార్లు మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితేనే నిన్ను,మీ అమ్మను ఇంట్లో నుంచి గెంటేస్తా అని ఆ చిన్నారని బెదిరించేవాడు మానిక్ చంద్. ఇలా భయపెట్టి అనేకసార్లు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే సొంత తాతే ఇలా చేస్తుండటంతో ఏం చేయాలో,ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదించేది ఆ బాలిక. ఇలా జరుగుతున్న సమయంలో బాధిత బాలిక తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది రోజులు హాస్పిటల్ లో ఉన్న తర్వాత చంటిబిడ్డతో తిరిగి తండ్రి ఇంటికి చేరుకుంది.

OMG : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని..భార్య చేయి నరికిన భర్త

అయితే గత నెల 18వ తేదీన తెల్లవారుజామున బాలిక తల్లి మెలుకవ వచ్చి కళ్లు తెరిచి చూస్తే..తన తండ్రి తన కూతురుతో అసభ్యంగా ఉంటటాన్ని గమనించింది. దీంతో వెంటనే తన కూతుర్ని అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించగా..ఆ చిన్నారి మొత్తం విషయం చెప్పింది. అయితే విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుంది బాధిత బాలిక తల్లి మౌనంగా ఉండింది. నిందితుడి కుటుంబ సభ్యులు.. బాధితురాలి తల్లికి ఈ విషయం బయటకు తెలియనివ్వొద్దని హెచ్చరించారు. తన తండ్రి చేసిన తప్పును ఎవరికీ చెప్పొద్దని బాధితురాలి తల్లితో వారించారు. అయితే . మొదట్లో భయపడిన ఆమె తన తండ్రి ఆగడాలు మితిమీరడంతో తాజాగా తన తండ్రిపై కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడు మానిక్ చంద్ బిందేశ్వరి సింగ్ ని అరెస్ట్ చేసి అతడిపై పోక్సో(POSCO)చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.



Road Named After Godse: కర్ణాటకలో మరో వివాదం..కొత్త రోడ్డుకు గాడ్సే పేరు!

నిందితుడి కూతురు ప్రసవం కోసం అతడి ఇంటికి వచ్చింది. ఆమె కుమార్తె 13 ఏళ్ల బాలిక సైతం తల్లితో పాటు ఉంటోంది. బాధితురాలు తన తాత వద్ద నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కుటుంబ సభ్యులు.. బాధితురాలి తల్లికి ఈ విషయం బయటకు తెలియనివ్వొద్దని హెచ్చరించారు. తన తండ్రి చేసిన తప్పును ఎవరికీ చెప్పొద్దని బాధితురాలి తల్లితో వారించారు. మొదట్లో భయపడిన ఆమె.. ఆ తరువాత కపిల్ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Maharashtra, Minor girl raped, Nagpur

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు