• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • OLD MAN FRAUD 18 LAKH RUPEES IN THE NAME OF JOBS AFTER HE JOINS IN OLD AGE HOME IN KURNOOL DISTRICT HSN

వృద్ధాశ్రమంలో చేరిన గుర్తు తెలియని వ్యక్తి.. నెలకు రూ.5వేలు ఇచ్చేవాడు.. చివరకు అతడెవరో తెలిసి అంతా షాకయ్యారు..!

వృద్ధాశ్రమంలో చేరిన గుర్తు తెలియని వ్యక్తి.. నెలకు రూ.5వేలు ఇచ్చేవాడు.. చివరకు అతడెవరో తెలిసి అంతా షాకయ్యారు..!

ప్రతీకాత్మక చిత్రం

గుర్తు తెలియని వృద్ధుడు. ఓ వృద్ధాశ్రమంలో చేరాడు. అందరితో మంచిగా ఉండేవాడు. ఎవరికైనా కష్టం ఉంటే తీర్చేవాడు. చివరకు అందరికీ ఊహించని షాకిచ్చాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  • Share this:
    మోసకారులు చాల ఓపికగా ఉంటుంటారు. పక్కా ప్లాన్ తో ఎక్కడి నుంచో ఊడి పడతారు. ముక్కూముఖం తెలియని వారితో కూడా పరిచయం పెంచుకుంటారు. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. మంచోళ్లనే పేరు తెచ్చుకుంటారు. ఆ తర్వాతే అసలు ప్లాన్ ను అమలు చేస్తారు. చిట్టీలనో, ఉద్యోగాలనో ఏదో ఒక పేరుతో డబ్బును దండుకుంటారు. ఊళ్లో వాళ్ల నుంచి డబ్బులను వసూలు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఉడాయిస్తారు. ఇలాంటివి ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నా మళ్లీ నయా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి రిపీటయింది. వృద్ధాశ్రమంలో చేరిన ఓ వ్యక్తి ఊళ్లో వాళ్లతో పరిచయం పెంచుకుని రూ.18 లక్షలను కొల్లగొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్నూలు జిల్లాలోని మద్దికెరలో శివజ్యోతి అనే వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలోకి ఎనిమిది నెలల క్రితం ఎం.వెంకట తిప్పారెడ్డి అనే వ్యక్తి చేరాడు. నెలకు రూ.5వేలు ఆశ్రమానికి ఇచ్చేవాడు. ఆశ్రమంలో ఉన్న వాళ్లందరితోనూ మంచిగా మాట్లాడేవాడు. ఎవరైనా దిగాలుగా ఉంటే జోకులు పేలుస్తూ ఉత్సాహాన్ని నింపేవాడు. అదే సమయంలో ఊళ్లోకి వెళ్తూ వ్యాపారులతోనూ, వాకింగ్ కు వచ్చే వాళ్లతోనూ పరిచయం పెంచుకున్నాడు. తనకు బడా బడా రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు తెలుసునని నమ్మబలికాడు. ఇది నిజమేనని అంతా నమ్మేంత స్థాయిలో అతడి వ్యవహారం ఉంటుంది కూడా. అతడికి శ్రీకాంత్ లాల్ అనే వ్యక్తి బాగా సన్నిహితుడిలా మారాడు. ఇటీవల విశాఖపట్టణంలో మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, నోటిఫికేషన్ ద్వారా కాకుండా సిఫారసుల ద్వారనే పని అవుతుందని శ్రీకాంత్ లాల్ తో నమ్మబలికాడు. రాజకీయ నాయకులను, అధికారులను మేనేజ్ చేయాల్సి ఉంటుందనీ రూ.18 లక్షలు ఇస్తే పని పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

    అతడు చెప్పింది నిజమేనని నమ్మి తనకు తెలిసిన కొందరితో ఈ విషయాన్ని శ్రీకాంత్ లాల్ చెప్పాడు. వాళ్లు కూడా నమ్మారు. దీంతో పట్టణానికి చెందిన రవి, గాది లింగప్ప, మరో వ్యక్తి కలిసి మొత్తం 18 లక్షల రూపాయలను శ్రీకాంత్ లాల్ ద్వారా తిప్పారెడ్డికి ఇచ్చారు. డబ్బు తీసుకున్న కొద్ది రోజుల తర్వాత అతడు ఆశ్రమంలోంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. దీంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. మధ్యవర్తిగా ఉన్న శ్రీకాంత్ లాల్ ఇంటి ముందు ఓ టెంటు వేసి వంటావార్పు చేపట్టి మరీ నిరసన చేబట్టారు. తమకు తిప్పారెడ్డి ఎవరో తెలియదనీ, శ్రీకాంత్ లాల్ కే డబ్బు ఇచ్చామని వాపోయారు. తమ డబ్బు తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరితోనూ సన్నిహితంగా ఉంటూ మంచి వాడని గుర్తింపు తెచ్చుకున్న వెంకట తిప్పారెడ్డి కాస్తా ఓ మోసగాడని తెలిసి అంతా షాకవుతున్నారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు