ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. హత్యకు గురైన భార్య వయసు 61 ఏళ్లు కాగా.. హత్య చేసిన భర్త వయసు 80 ఏళ్లు. ఈ వయసులో ఉన్న ఒక వ్యక్తి తన భార్యను హత్య చేయాల్సిన పరిస్థితులు సాధారణంగా ఉత్పన్నం కావు. కానీ ఈ సంఘటన మాత్రం కాస్త భిన్నమైనది. పూర్తి వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ సందర్భంగా తన 80 ఏళ్ల భర్తతో శృంగారం చేసేందుకు 61 భార్య నటాలియా అంగీకరించింది. చాలాకాలం తరువాత భార్య తనతో శృంగారం చేయడానికి అంగీకరించడంతో.. ఆమె భర్త ఆనందంతో పొంగిపోయాడు. అయితే తన వయసు శృంగారం చేసేందుకు పెద్దగా సహకరించదనే విషయం తెలుసుకున్నారు. అయితే ఎలాగైనా భార్యతో శృంగారంలో పాల్గొనేందుకు వయాగ్రా తరహాలో శక్తివంతమైన మందులు తీసుకున్నాడు.
అలా భార్యతో శృంగారం చేయడానికి 80 ఏళ్ల వ్యక్తి మానసికంగా, శారీరికంగా సిద్ధమయ్యారు. కానీ అతడు అనుకున్నట్టుగా జరగలేదు. తాను ముందుగా అంగీకరించినట్టుగా భర్తతో శృంగారం చేయడానికి నటాలియా సిద్ధపడలేదు. మరో రోజు చూసుకుందామంటూ అతడిని వారించింది. అయితే శృంగారంలో పాల్గొనేందుకు మందులు వేసుకున్న 80 ఏళ్ల విటో భార్య నటాలియా చర్యలతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే కత్తి తీసుకుని ఆమెపై దాడి చేశాడు. నాలుగుసార్లు ఆమె ఛాతిపై పొడిచాడు. దీంతో 61 ఏళ్ల నటాలియా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
భార్యను హత్య చేసిన అనంతరం ఆ వ్యక్తి ఉదయం అల్పాహారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత తన కుక్కను ఎప్పటిలాగే వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అందరితోనూ ఎప్పటిలాగే మాట్లాడుతూ పోయాడు. అక్కడ తన భార్య హత్య గురించి తన పొరుగువారికి చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేయాలని వారికి తెలిపాడు. కానీ ఇరుగుపోరుగువాల్లు ఈ విషయానికి దూరంగా ఉన్నారు. అయితే ఆ తరువాత ఓ మహిళ నటాలియా కోసం ఆమె ఇంటికి వచ్చింది.
అయితే ఆమె భర్త ఆ మహిళను లోపలికి వెళ్లనీయలేదు. నటాలియా బాస్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు వింటో ఆమెను హత్య చేసినట్టు అతడికి చెప్పాడు. అంతేకాదు నటాలియాతో ఆమె బాస్ రొమాన్స్ చేస్తున్నాడని ఆరోపించాడు. నటాలియా బాస్ పోలీసులకు సమాచారం అందించడంతో.. వాళ్లు ఆ ఇంటికి వెళ్లారు. నటాలియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాన్ని విటోను అడిగారు. వయాగ్రా తీసుకున్న తర్వాత తన భార్య సెక్స్‌కు నిరాకరించిందని.. అందుకే ఆమెను చంపేశానని అసలు విషయం చెప్పాడు
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.