‘గెట్ అవుట్’... మహిళను అర్ధరాత్రి నడిరోడ్డు మీద దించేసిన క్యాబ్‌డ్రైవర్...

ఎలా వెళ్లాలో చెబుతున్న వినకుండా అడ్డదారులు... నిలదీసినందుకు నడిరోడ్డు మీద అవమానం... కస్టమర్ కేర్‌కు కాల్ చేసినా పట్టించుకోని వైనం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 15, 2018, 6:34 PM IST
‘గెట్ అవుట్’... మహిళను అర్ధరాత్రి నడిరోడ్డు మీద దించేసిన క్యాబ్‌డ్రైవర్...
నమూనా చిత్రం
  • Share this:
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీ అన్నాడు. అయితే ఓ క్యాబ్ డ్రైవర్ నిర్వాకం కారణంగా అర్ధరాత్రి నడిరోడ్డు మీద నిస్సహాయంగా నిల్చోవాల్సి వచ్చిందో మహిళ. బెంగళూరులో ఓ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు క్యాబ్ డ్రైవర్‌. ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్న ఆ మహిళ... తనను వేధించిన డ్రైవర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. దాంతో స్పందించిన సదరు ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థ ఆ డ్రైవర్‌ను ‘బ్లాక్ లిస్ట్‌’లో చేర్చింది. బెంగళూరు నగరంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆకాంక్ష హజారీ అనే మహిళ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి దిగి... ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. రాత్రి 11.30లకు క్యాబ్‌లో ఎక్కిన ఆకాంక్ష హజారీ... డ్రైవర్ తాను చెప్పిన రూట్‌లో వెళ్లేందుకు ఇష్టపడలేదని చెప్పింది.

షార్ట్ కట్‌లో త్వరగా తీసుకెళ్తానని చెప్పి... టోల్ గేట్ ఫీజు తప్పించుకునేందుకు సిటీలో ఎక్కడెక్కడో తిప్పాడని పేర్కొంది. ఇందేంటని నిలదీయడంతో ‘గెట్ ఆఫ్’ అంటూ కారులో నుంచి దిగమని బెదిరించాడని వెల్లడించింది. మార్గమధ్యంలో దించేసి... గొడవకి దిగాడని వాపోయింది. తర్వాత ఎవరెవరికో ఫోన్ చేసి... తనకు అర్థం కాని భాషలో మాట్లాడడని ట్వీట్ చేసింది. ఈ సంఘటనతో తాను చాలా బెదిరిపోయానని... అతని నుంచి తప్పించుకునేందుకు క్యాబ్‌లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కానని చెప్పింది. ఓలా సపోర్ట్ స్టాఫ్ నుంచి తనకు కాల్ వచ్చిందని.. రైడ్‌ను ట్రాక్ చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారని పేర్కొంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌కు కాల్ రావడంతో ఏమీ మాట్లాడకుండా కొద్దిదూరం వెళ్లాక మళ్లీ కారుని ఆపాడని చెప్పింది. దాంతో అనుమానం వచ్చి మరోసారి ఎమర్జెన్సీ బటన్ నొక్కినా... ఎవ్వరూ కాంటాక్ట్ చేయలేదని వరుస ట్వీట్లలో వివరించింది. భయంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసినట్టు చెప్పిన ఆకాంక్ష... వాళ్లు కూడా కాపాడడానికి రాలేదని వాపోయింది.

ఆ తర్వాత యాప్ ద్వారా కస్టమర్ సపోర్ట్ టీమ్‌కి కాల్ చేస్తే... ఓ కొత్త వ్యక్తి తనతో మాట్లాడాడని చెప్పింది. అతనికి అంతా వివరించాక డ్రైవర్‌తో మాట్లాడి ట్రిప్ పూర్తిచేయాలని స్పష్టం చేసినట్టు పేర్కొంది. అయితే ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ట్వీట్ చేస్తున్నట్టు ఆకాంక్ష పేర్కొవడం విశేషం. ఈ ట్వీట్‌కు స్పందించిన బెంగళూరు పోలీసులు... అతనిపై లిఖితపూర్వక కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. డ్రైవర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్టు ఓలా క్యాబ్ ప్రతినిధులు ప్రకటించారు.ఇవి కూడా చదవండి...

Video: ప్రాణం తీసిన తాడాట... టగ్ ఆఫ్ వార్ ఆడుతూ మెడికల్ స్టూడెంట్ మృతి...


డబ్బులు తీసుకోకుండా సరుకులు ఇవ్వాలని... విద్యార్థి ఆత్మహత్య...


లైంగిక వేధింపులను నిషేధిస్తూ చట్టం... జమ్మూ &కశ్మీర్ సరికొత్త చరిత్ర...

First published: December 15, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>