Ola Cab : ఓలా ఆఫీస్ ఎదుట క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన...

Hyderbad : హైదరాబాద్‌లోని ఓలా ఆఫీస్ ముందు ఆ క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన చెయ్యాలనుకున్నాడు. అతను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో, అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 12:00 PM IST
Ola Cab : ఓలా ఆఫీస్ ఎదుట క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో ఇదో అనూహ్య సంఘటన. కూకట్‌పల్లిలో ప్రపంచ ప్రముఖ కంపెనీ ఓలా క్యాబ్ ఆఫీస్‌కి వెళ్లిన ఆ క్యాబ్ డ్రైవర్ అర్జున్ ఒక్కసారిగా బట్టలన్నీ విప్పేశాడు. ఆఫీస్ ముందు నగ్నంగా నిలబడ్డాడు. అతని చర్య చూసి ఆఫీస్‌లో ఉద్యోగులు, కంపెనీ యాజమాన్యంతోపాటూ... రోడ్డుపై వెళ్లే వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. అయ్యో అతనేంటి అలా బట్టలిప్పేశాడు అనుకున్నారు. ఓలా మేనేజ్‌మెంట్‌ చాలా కంగారు పడింది. కంపెనీలో సీనియర్ ఉద్యోగులు ఇప్పుడేం చెయ్యాలి. ఇలా చేస్తాడనుకోలేదు అని కంగారుపడ్డారు. అతని దగ్గరకు వెళ్లి, అలా చెయ్యొద్దని చెబుదామంటే... ఏం జరుగుతుందోనన్న ఆలోచనతో ఆఫీస్‌లో ఉద్యోగులెవరూ అర్జున్ దగ్గరకు వెళ్లలేదు. అర్జున్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సైలెంట్‌గా నగ్న నిరసన చేశాడు.

ప్రస్తుతం ఓలా రూ.300 కోట్లకు పైగా విలువైన కంపెనీ. ఈ ఏడాది మార్చిలో... 150కి పైగా డ్రైవర్లు బెంగళూరులో కంపెనీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కంపెనీ విధానాలపై మండిపడ్డారు. లీజ్ అగ్రిమెంట్లలో తమ నుంచీ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాళ్లంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా కేసులో అర్జున్ ను క్యాప్ వాడనివ్వకుండా కంపెనీ యాజమాన్యం అడ్డుకుంటోంది. ఐతే, వెహికిల్‌కి రోజూ చెల్లించే రెంటు మాత్రం చెల్లించాల్సిందేనంటోంది. ఏదైనా సమస్య ఉంటే కంపెనీ టెక్నికల్ విభాగానికి చెప్పుకోమంది యాజమాన్యం. పది రోజులుగా ఇదే సమస్య. మిగతా డ్రైవర్లు కూడా అర్జున్‌కి అండగా నిలిచారు. కొంతసేపు నగ్న నిరసన చేసిన అర్జున్ చివరకు కంపెనీ నుంచీ ఎలాంటి హామీ రాకుండానే వెనుదిరిగాడు. ఇతర క్యాబ్ డ్రైవర్లతో కలిసి మరింత ఉద్ధృత పోరాటం చేస్తాడని తెలిసింది.

 

ఇవి కూడా చదవండి :

చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత... అసలు కారణం అదేనా...

వైసీపీ విజయం... టీడీపీ ఓటమి... ఆ సర్వే ప్రకారం ఈ ఫలితంనెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ఇస్రోను టార్గెట్ చేస్తున్నారా...

ఏపీలో మళ్లీ ఎన్నికలు తప్పవా... టీడీపీ ప్లాన్ అదేనా... వైసీపీ ఏం చేస్తుంది ?
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading