Lock Down కష్టాలు : అప్పులు తీర్చడం దొంగగా మారిన ప్రవైటు ఉద్యోగి...!

ప్రతీకాత్మక చిత్రం

Lock Down కష్టాలు : లాక్డౌన్‌లో ఉద్యోగం పోవడంతో..చేసిన అప్పులు తీర్చడం కోసం ఓ ప్రైవేటు ఉద్యోగి దొంగగా మారాడు..ఒంటరి ఆడవాళ్ల మెడలో చైన్‌ దొంగిలించి చివరకు పట్టుబడ్డాడు..

  • Share this:
    కరోనా అనేక మంది జీవితాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపింది..కరోనా సోకి చాలా మంది జీవితాలు ఆగం అయ్యాయి..మరోవైపు కరోనాతో లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు మనుషుల జీవితాలు ఆగం అయిపోయాయి.. కొంతమంది ఉపాధి లేక రోడ్డుమీద కూలీలుగా అవతారమెత్తితే..మరికొంత మంది లాక్‌డౌన్ కష్టాలనుండి బయటపడలేని వారు వారి జీవితాలను సైతం పోగొట్టుకున్నారు. ఇలా చాలా మంది జీవితాలు ఉపాధి లేక రోడ్డుమీద పడ్డాయి..

    అయితే లాక్‌డౌన్ కష్టాల నుండి బయట పడ్డానికి కొంతమంది అడ్డదారులు తొక్కారు..చదువుకున్న వారు సైతం దొంగలుగా మారారు. కొద్ది మంది యువత ఉద్యోగాలు కోల్పోయి ఉపాధిమార్గంగా దొంగతనాన్ని ఎంచుకున్నారు..అప్పులు తీర్చేందుకు వక్రమార్గాలు పట్టారు.

    ఈ క్రమంలోనే ఓ ఎంబీఏ చదివిన షేక్ గౌస్ అనే యువకుడికి ఉద్యోగం పోవడంతో దొంగగా మారి కటకటలా పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటు చేసుకుంది.ఆయువకుడు ఎంబీఏ చదివి ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండేవాడు. మంచి ఉద్యోగం చూస్తూ కాలం గడుపుతున్న సమయంలో కరోనా దెబ్బతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో చైన్‌ స్నాచర్‌ అవతారం ఎత్తాడు.

    ఒంటరి మహిళలను చూసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.. ఇలా నగరంలో ఒంటిరిగా వస్తున్న మహిళ మెడలో బంగారుచైన్‌ లాక్కుని పారిపోయాడు.. దీంతో పోలీసులు గౌస్‌ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయో విషయాలను గౌస్ చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది.. ఉద్యోగం పోవడంతో అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయని, కేవలం ముప్పై అయిదు వేల రూపాయల అప్పుకోసం దొంగతనం చేసేందుకు దొంగతనం చేసానని ఒప్పుకున్నాడు.
    Published by:yveerash yveerash
    First published: