OFFICERS AT SHAMSHABAD AIRPORT SEIZED SMUGGLING GOLD ZIP PULLERS FROM A PASSENGER ARRIVED FROM SHARJAH NK
జిప్ పుల్లర్స్తో గోల్డ్ స్మగ్లింగ్... అతి తెలివికి ఆశ్చర్యపోయిన అధికారులు...
జిప్ పుల్లర్స్తో గోల్డ్ స్మగ్లింగ్... అతి తెలివికి ఆశ్చర్యపోయిన అధికారులు...
Hyderabad Airport : మీకు చిత్ర విచిత్రమైన క్రైమ్ కేసులు కావాలంటే... శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చేమో. ఎందుకంటే అక్కడ నమోదవుతున్న స్మగ్లింగ్ కేసులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Hyderabad Airport : శంషాబాద్ ఎయిర్పోర్ట్... ఇదివరకం బిజీగా ఏమీ లేదు. కానీ... వద్దు వద్దంటున్నా విదేశాల నుంచీ చాలా మంది పర్యాటకులు, ప్రజలు వస్తూనే ఉన్నారు. సరే... అలా వచ్చిన వాళ్లకు రెగ్యులర్‌గా థెర్మల్ స్క్రీన్ టెస్టులూ, అవీ జరిపి... తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సోమవారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచీ G9 458 బోయింగ్ విమానం... రాజసం ఒలకబోస్తూ... ఎయిర్పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. అందులోంచీ పర్యాటకులు వన్ బై వన్ దిగుతూ... ఎయిర్ పోర్ట్‌లోకి ఎంటరవుతున్నారు. వాళ్లలో ఓ వ్యక్తి లలలా... లులులూ... అని ఏదో హమ్ చేసుకుంటూ... ఎయిర్‌పోర్టులోకి ఎంటరయ్యాడు. చెకింగ్స్ చేస్తుంటే... "నథింగ్... చెక్ కంప్లీట్ లీ" అంటూ లగేజీ మొత్తం స్కాన్ మిషన్‌లో పెట్టాడు. సెక్యూరిటీ అతన్ని చెక్ చేసింది. అంతా బాగానే ఉంది. అనుకుంది. తర్వాత... థెర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. అక్కడ కూడా కరోనా లక్షణాలు ఏవీ లేవని అర్థమైంది. ఓకే నువ్వు వెళ్లొచ్చు అన్నట్లు సైగ చేశారు అధికారులు. "థాంక్యూ" అంటూ తన లగేజీ తీసుకొని వెళ్లసాగాడు.
అతడు ఎగ్జిట్ డోర్ దగ్గరకు వెళ్తున్న సమయంలో... అతని లగేజీలోని ఓ జిప్ పుల్లర్... మెరిసింది. అది ఓ అధికారి చూశాడు. అదేంటి... మిగతా జిప్పులన్నీ మెరవలేదే... అది ఎలా మెరుస్తోంది... అన్న డౌట్ వచ్చింది. "స్టాప్... స్టాప్ హిమ్" అని అరవడంతో... ఎగ్జిట్ డోర్ దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఆపారు. "వై... ఆల్రెడీ చెక్డ్" అంటూ బిల్డప్ ఇచ్చాడు. అతని దగ్గరకు వచ్చిన అధికారులు... కమాన్ అంటూ పక్కకు తీసుకెళ్లారు. ఆ మెరిసిన జిప్ ఏంటా అని చూస్తే... అది బంగారంతో తయారుచేసిన జిప్... వార్నీ అంటూ ఆశ్చర్యపోయారు. అదొక్కటే కాదు... లగేజీలోని అన్ని జిప్పుల పుల్లర్లూ బంగారంతో చేసినవే... వాటిపైన సిల్వర్ కోటింగ్ వేయడంతో... అధికారులు ముందు గుర్తించలేకపోయినా... చివర్లో గుర్తించారు.
జిప్ పుల్లర్స్తో గోల్డ్ స్మగ్లింగ్... అతి తెలివికి ఆశ్చర్యపోయిన అధికారులు...
అతని దగ్గర రెండు ఐ ఫోన్లను కూడా చూశారు. ఇవేంటి అని చెక్ చేస్తే... వాటిలోనూ బంగారం ఉన్నట్లు అర్థమైంది. అతని నుంచీ మొత్తం 133.5 గ్రాముల స్మగ్లింగ్ గోల్డును కస్టమ్స్ యాక్ట్ కింద సీజ్ చేశారు. మొత్తం స్మగ్లింగ్ విలువ రూ.5.50 లక్షలుగా తేల్చారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రకరకాల వ్యక్తులు, రకరకాలుగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.