హోమ్ /వార్తలు /క్రైమ్ /

డబ్బులు ఇచ్చి కన్న కూతురుని హత్య చేయించిన తల్లి.. ఆ విషయంలో చెప్పిన మాట వినకపోవడంతో..

డబ్బులు ఇచ్చి కన్న కూతురుని హత్య చేయించిన తల్లి.. ఆ విషయంలో చెప్పిన మాట వినకపోవడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి.. డబ్బులు ఇచ్చి మరి కూతురిని హత్య చేయించింది. ఓ విషయంలో కూతురి తీరుతో అసంతృప్తి చెందిన తల్లి ఈ విధంగా చేసింది.

కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి.. డబ్బులు ఇచ్చి మరి కూతురిని హత్య చేయించింది. ఓ విషయంలో కూతురి తీరుతో అసంతృప్తి చెందిన తల్లి ఈ విధంగా చేసింది. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. రైసువానా గ్రామానికి చెందిన సుకాంతి గిరి అనే 58 ఏళ్ల మహిళ కూతురు షిబానీ నాయక్(36). షిబానీకి వివాహం అయినప్పటికీ ఆమె తల్లి ఇంటి వద్దే ఉంటుంది. షిబానీకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే షిబానీ అక్రమ మద్యం వ్యాపారం చేస్తుండేంది. ఈ విషయం నచ్చని ఆమె తల్లి పలుమార్లు షిబానీతో గొడవ పడింది. అక్రమ మద్యం వ్యాపారం వదులుకోవాలని షిబానీని కోరింది. కూతరును ఆ మార్గం నుంచి బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే అవేమీ కూడా ఫలించలేదు. ఈ నేపథ్యంలో తల్లీకూతురు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

తన కుమార్తె అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించడం పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన సుకిరి గిరి.. ఆమెను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే షిబానీని అడ్డుతొలగించుకునేందుకు ప్రమోద్ జెనా(32) అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించింది. షిబానీని హత్య చేయించేందుకు ప్రమోద్‌తో సుకిరి గిరి రూ. 50వేల డీల్ ఫైనల్ చేసుకుంది. ఇందుకోసం ప్రమోద్‌కు తొలుత అడ్వాన్స్ కింద రూ. 8వేలు చెల్లించింది. దీంతో ప్రమోద్ మరో ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో షిబానీని జనవరి 12వ తేదీన రాళ్లు, ఇతర వస్తువులతో కొట్టి చంపాడు.షిబానీ మృతదేహాన్ని నాగారం గ్రామంలోని వంతెన కింద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ప్రమోద్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం సుకాంతిని అదులపులోకి తీసుకున్నారు. షిబానీని హత్య చేసిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

First published:

Tags: Crime news, Murder, Odisha

ఉత్తమ కథలు