యువతిపై దారుణం... కారులో రేప్ చేసి... కాలేజీ దగ్గర పడేశారు..

కారులో యువతిపై ఒక్కరే అత్యాచారం చేశారా? లేకపోతే గ్యాంగ్ రేప్ జరిగిందా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: November 7, 2019, 7:28 PM IST
యువతిపై దారుణం... కారులో రేప్ చేసి... కాలేజీ దగ్గర పడేశారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒడిశాలో దారుణం జరిగింది. ఓ యువతిని కారులో రేప్ చేసి.. ఆమెను అత్యంత దారుణ స్థితిలో కాలేజీ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ యువతి బస్టాప్‌లో నిలబడి ఉండగా, ఓ వ్యక్తి కారులో వచ్చి ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించింది. అయితే, అనంతరం ఆమె కాలేజీ వద్ద దారుణ స్థితిలో కనిపించింది. శరీరం మీద గాట్లు, చిరిగిపోయిన దుస్తులతో కాలేజీ వద్ద రోడ్డుపక్కన పడిపోయి ఉంది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువతిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో యువతిపై ఒక్కరే అత్యాచారం చేశారా? లేకపోతే గ్యాంగ్ రేప్ జరిగిందా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు షాక్‌లో ఉందని, ఆమె కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.

First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు