హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాకింగ్.. సంక్రాంతి పండగ రోజు పుణ్యస్నానానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్..

షాకింగ్.. సంక్రాంతి పండగ రోజు పుణ్యస్నానానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్..

కాగా బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 సంవత్సరాల అభినవ్‌గా   జవహర్‌ నగర్‌ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు సైకో మారాడని ఇలా చిన్న పిల్లలకు ఆశచూపి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం

కాగా బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 సంవత్సరాల అభినవ్‌గా జవహర్‌ నగర్‌ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు సైకో మారాడని ఇలా చిన్న పిల్లలకు ఆశచూపి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి పర్వదినం రోజున దారుణం చోటుచేసుకుంది. పండగను పురస్కరించుకుని నదిలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన యువతిని దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు.

దేశంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు మృగాళ్లు విచక్షణ రహితంగా మహిళలు, చిన్నారులపై దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన, హెచ్చరికలు జారీచేసిన అటువంటి వారిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా సంక్రాంతి పర్వదినం రోజున దారుణం చోటుచేసుకుంది. పండగను పురస్కరించుకుని నదిలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన యువతిని దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని బరిపడా టౌన్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి ఆమె సోదరితో కలిసి గురువారం ఉదయం నదిలో పుణ్యస్నానం చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారిని నది వరకు వెంబడించారు. ఇక, అందులో ఒక యువతి ఒడ్డున నిల్చుని ఉండగా.. మరో యువతి నదిలోకి దిగింది. ఆ సమయంలోనే ఇద్దరు నిందితులు బాధిత యువతిని అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే యువతి గట్టిగా కేకలు వేయడంతో వారిద్దరు అక్కడి నుంచి పారిపోయారు.

ఇంటికి తిరిగివచ్చాక బాధిత యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి ఆమె బరిపడా పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తనపై జరిగిన లైంగిక దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇక, పీఆర్‌ఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఫిర్యాదు చేసిన యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారని బరిపడా టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్స్‌స్పెక్టర్ సేనాపతి తెలిపారు.

First published:

Tags: Gang rape, Odisha, Sankranti 2021

ఉత్తమ కథలు