ODISHA SUSPENDED BJD MLA RAMS CAR INTO CROWD 20 INJURED ONE KILLED PVN
Video : జనాలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు..ఎమ్మెల్యేను చితకబాదిన ప్రజలు
ప్రజలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు
Odisa MLA Car : ఆఫీసు ముందు నిల్చున్న ప్రజలపై బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే జగ్ దేవ్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.
Odisha Chilika MLA : గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన తరువాత మళ్లీ అటువంటి ఘటన తాజాగా ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు ప్రజలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. పంచాయతీ సమితి చైర్ పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా ఖుర్దా జిల్లాలోని బాన్ పుర్ బ్లాక్ ఆఫీసు ముందు నిల్చున్న ప్రజలపై బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే జగ్ దేవ్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. వారిని హుటాహుటిన భువనేశ్వర్ ఎయిమ్స్ కు తరలించారు. ఇక,ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక్కరు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.
ఘటన జరిగిన అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎమ్మెల్యేను బయటకు లాగి తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేపై తిరగబడి చితకబాదడంతో పాటు ఆయన కారు కూడా ధ్వంసం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే జగ్ దేవ్ ను పోలీసులు రక్షించి భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన పై దర్యాప్తు జరుగుతోందని ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాధి తెలిపారు.
కాగా,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గతేడాది సెప్టెంబర్ లో బీజేడీ జగ్ దేవ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో స్థానిక బీజేపీ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై అధికార బిజూ జనతాదళ్ నుంచి జగదేవ్ సస్పెండ్ అయ్యారు. ఖుర్దా జిల్లా ప్రణాళికా సంఘం అధ్యక్ష పదవి నుంచి కూడా జగ్ దేవ్‌ను తొలగించారు. మరోవైపు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ హరిశ్చంద్ర డిమాండ్ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.