బైక్ కొనాలా..? నోట్లు అచ్చెయ్.. బండి కొనేయ్..! ఇదో కొత్త తరహా నేరం

మీ అవసరాల నిమిత్తం టూ వీలర్ బైక్ కొనాలనుకుంటే ఏం చేస్తారు..? డబ్బున్నవాళ్లైతే మొత్తం ఒకేసారి తీసుకుంటారు. లేనివాళ్లు వాయిదాల్లో చెల్లించి కొనుక్కుంటారు. కానీ ఒడిషా కు చెందిన ఒక వ్యక్తికి అప్పులు చేయడం అస్సలిష్టం ఉండదు. అందుకే అచ్చేశాడు.

news18
Updated: October 21, 2020, 8:23 AM IST
బైక్ కొనాలా..? నోట్లు అచ్చెయ్.. బండి కొనేయ్..! ఇదో కొత్త తరహా నేరం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 21, 2020, 8:23 AM IST
  • Share this:
సాధారణంగా మనం టూ వీలర్ బైక్ కొనాలంటే ఏం చేస్తాం. డబ్బులు పోగేసుకుని షోరూమ్ కు వెళ్లి కొనుక్కుంటాం. డబ్బులు ఉన్నవాళ్లైతే పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించి కొనుక్కుంటారు. లేనివాళ్లు వాయిదాల్లో చెల్లింపులు పెట్టి బైక్ తీసుకుంటారు. ఒడిషా కు చెందిన ఒక వ్యక్తి కూడా బైక్ కొనడానికి ఈ మధ్యే బైక్ ల షోరూం కు వెళ్లాడు. బైక్ చూశాడు. నచ్చింది. డబ్బులన్నీ తీసి సేల్స్ మెన్ ముందు పెట్టాడు. ఎందుకో అతడికి అనుమానం వచ్చింది. చెక్ చేశాడు. అవన్నీ నకిలీ నోట్లు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. ఆ నకిలీ నోట్లు వేరే చోటు నుంచి తీసుకొచ్చినవి కావు.. ఏకంగా ఆ నిందితుడే అచ్చేశాడు. అదెలా అంటారా..? అయితే ఇది చదవండి.

ఒడిషా లోని నయాగఢ్ కు చెందిన దివ్యరంజన్ అనే వ్యక్తికి రేసింగ్ బైక్ ల మీద పిచ్చి. ఒక మంచి రేసింగ్ బైక్ కొనాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. దగ్గర్లో ఉన్న బైక్ షోరూమ్ కు వెళ్లాడు. బైక్ చూశాడు. బైక్ కండిషన్, దాని ఫీచర్స్.. ఆ ప్రక్రియ పూర్తైంది. ఇక సేల్స్ మెన్ పేపర్లు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాడు. డబ్బులు ఎలా కడతారు..? వాయిదాల్లోనా లేక మొత్తం చెల్లిస్తారా..? అని అడిగాడు. దానికి దివ్యరంజన్.. ‘అబ్బబ్బే.. మొత్తం ఒకేసారి చెల్లిస్తా’ అంటూ జేబులో నుంచి లక్షా ముప్పై వేల రూపాయలు తీసి సేల్స్ మెన్ ముందుపెట్టాడు. అన్నీ రూ. 500 డినామినేషన్ తో ఉన్న నోట్లే.

సేల్స్ మెన్ కు ఎందుకో అనుమానం వచ్చింది. అవి నకిలీ నోట్లని గుర్తించాడు. ఇదే విషయాన్ని వారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీన్ లోకి ఎంట్రీ అయిన పోలీసులు.. విషయం ఆరా తీయగా వారికి షాకింగ్ నిజం తెలిసింది. దివ్యరంజన్ సేల్స్ మెన్ కు ఇచ్చినవాటిలో రూ. 5వేలు మినహా అంతా నకిలీనోట్లే.

అంతేగాక ఆ నకిలీ నోట్లు కూడా అతనింట్లో.. స్వయంగా అతడు తయారుచేసినవే. దీంతో పోలీసులు దివ్యరంజన్ ఇంటికెళ్లారు. అక్కడ నకిలీ నోట్లను ముద్రించడానికి ప్రింటర్, కంప్యూటర్, సగం ముద్రించిన నోట్ల కట్టలు, అందుకు కావాలసిన ఇతర సామాగ్రి ఉంది. అవి చూసి అవాక్కయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద నిందితుడిని అరెస్టు చేసి జైళ్లో పెట్టారు.
Published by: Srinivas Munigala
First published: October 21, 2020, 8:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading