హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife Sold : వీడెక్కడి మొగుడండీ.. భార్యను అమ్మేశాడు

Wife Sold : వీడెక్కడి మొగుడండీ.. భార్యను అమ్మేశాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొనేవాళ్లు ఉండాలే గానీ ఏదైనా అమ్మేయడానికి సిద్ధపడతారు కొందరు. అలాంటి ఓ మహానుభావుడు.. తన భార్యను అమ్మేశాడు. ఇది పెద్ద కలకలమే రేగింది. ఆ తర్వాత కథలో అసలు ట్విస్ట్ ఇప్పు‌డు వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Odisha : పెళ్లి చేసుకునేటప్పుడు వేద మంత్రాల సాక్షిగా బోలెడు ప్రమాణాలు చేస్తారు. తీరా పెళ్లి తర్వాత వాటిలో చాలా వరకూ గాల్లో కలిసిపోతాయి. అతగాడి నిర్వాకం కూడా అలాగే ఉంది. ఒడిశాలోని.. కలహండి జిల్లాలో ఉండేవా‌డు ఖిరా బెరుక్. అతనో వలస కూలీ. అతనికి పౌర్ణమిని ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. పౌర్ణమి రాకతో.. అతని జీవితంలోకి నిండు జాబిలి వెలుగులొచ్చాయి. కానీ పౌర్ణమి జీవితమే అంధకారం అయ్యింది. ఎందుకు చేసుకున్నాడో తెలియదు. భార్యతో సరిగా వ్యవహరించేవాడు కాదు. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత.. అక్టోబర్ 30న.. ఢిల్లీలో పని దొరికిందని చెప్పి.. భార్యను తీసుకొని దేశ రాజధానికి వెళ్లాడు.

రెండ్రోజుల తర్వాత (నవంబర్ 2న) తాపీగా ఒడిశా వచ్చేశాడు. అతను ఢిల్లీ వెళ్లిన విషయం పౌర్ణమి తల్లిదండ్రులకు తెలుసు. రిటర్న్ వచ్చిన విషయం తెలియదు. పౌర్ణమి అతి కష్టమ్మీద తన తండ్రికి కాల్ చేసింది. "నాన్నా అతను మంచివాడు కాదు. నన్ను ఢిల్లీలో ఓ వ్యక్తికి అమ్మేశాడు. అతనే నీ భర్త అని అతనికి అప్పగించి వెళ్లిపోయాడు. నన్ను కాపాడండి" అని చెప్పింది. ఆ మాటలు వినగానే తండ్రి చేతులు వణికాయి. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. కుర్చీలో కూలబడ్డాడు.

Ouija : ఊజా బోర్డ్ ఆడి.. స్పృహతప్పిన 11 మంది విద్యార్థులు.. దెయ్యం ఆవహించిందా?

కాసేపటికి తేరుకున్న తండ్రి.. గుండె ధైర్యం తెచ్చుకొని.. నవంబర్ 6న నర్లా పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు.. ఖిరా బెరుక్‌ని అరెస్టు చేసి ప్రశ్నించగా.. పౌర్ణమిని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశానని చెప్పాడు. ఇప్పు‌డు ఓ పోలీస్ బృందం ఢిల్లీ బయలుదేరింది. త్వరలోనే పౌర్ణమిని వెతికి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతోంది. కానీ పౌర్ణమి ఎక్కడుందో తెలియదు? ఆమెను కొనుక్కున్న వాడు ఎలాంటి వాడో తెలియదు. ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి వారం దాటిపోయింది. ఆమె తల్లిదండ్రులకు క్షణమొక యుగంలా ఉంది.

స్కానింగ్ సెంటర్‌లో సీక్రెట్ కెమెరా.. అమ్మాయిలే టార్గెట్.. యువకుడి అరెస్ట్

పిల్లలకు పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకు అతి పెద్ద బాధ్యత. ఎన్నో ఆలోచించి పెళ్లి చేస్తారు. ఎంతో మంది పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తారు. తీరా ఆ పెళ్లిలో తేడాలు వస్తే.. అటు తల్లిదండ్రులకూ, ఇటు వధూవరులకూ అందరికీ సమస్యే. ఇలాంటి మోసపూరిత భర్తలను ఊరికే వదిలేయకూడదనే ఉద్దేశంతోనే కేసు పెట్టామన్న అమ్మాయి తండ్రి.. తమ కూతురు సురక్షితంగా తిరిగి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Crime news, Odisha

ఉత్తమ కథలు