నాగుపాముతో సెల్ఫీ... యువకుడి అరెస్ట్

ఒడిశాలో కొందరు యూత్ బుసలు కొడుతున్న నాగుపాముతో సెల్ఫీలు దిగారు. ఈ వీడియో సోష్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: July 20, 2019, 8:47 AM IST
నాగుపాముతో సెల్ఫీ... యువకుడి అరెస్ట్
నమూనా చిత్రం
  • Share this:
సెల్ఫీ పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్తోంది. టిక్ టాక్ వీడియోలు... సెల్ఫీలు తీసుకుంటూ... యువత ప్రాణాలుపైకి తెచ్చుకుంటున్నారు. యువతలో సెల్ఫీ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. సెల్ఫీ మోజులో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అయినా యువతలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. ఒడిశాలో కూడా కొంతమంది ఇలాగే... ప్రాణాలను పణంగా పెట్టి సెల్ఫీలను దిగుతున్నారు. ఒడిశాలో కొందరు యూత్ బుసలు కొడుతున్న నాగుపాముతో సెల్ఫీలు దిగారు. ఈ వీడియో సోష్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొందరు అమ్మాయిలు... అబ్బాయిలు.. నాగుపాముతో సెల్ఫీలు దిగారు. రోహిత్ అనే యువకుడు నాగుపాముతో ఆటలాడాడు.

ఈసారి ప్రాణాలు పోలేదు కానీ.. సెల్ఫీ తీసుకున్న యువకుడిని మాత్రం పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బర్‌గఢ్‌కి చెందిన కొందరు యువతీ యువకులు ఓ నాగుపాముతో సెల్ఫీలు దిగారు. అక్కడితో ఆగక రోహిత్ అనే యువకుడు దాంతో ఆటలాడాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయి వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి చేరాయి. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రోహిత్‌ను అరెస్ట్ చేశారు.ప్రాణాలు పోగట్టే ఇలాంటి సెల్ఫీలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>