ఇద్దరు భార్యల పోరు.. ఇద్దర్నీ చంపేసిన భర్త ఏం చేశాడంటే..

శ్యామ మరాండీ అనే గిరిజన వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. సల్కు మరాండీ, పూలమణి మరాండీ అనే ఇద్దరు భార్యలు.

news18-telugu
Updated: May 22, 2019, 9:01 PM IST
ఇద్దరు భార్యల పోరు.. ఇద్దర్నీ చంపేసిన భర్త ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇద్దరు భార్యలు పరస్పరం తిట్టుకోవడం, కొట్టుకోవడం.. మళ్లీ తన వద్ద పంచాయతీ పెట్టడంతో విసిగిపోయిన భర్త ఆ ఇద్దరినీ చంపేశాడు. ఆ తర్వాత తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని మయూర్‌గంజ్ జిల్లా తడిసికోల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శ్యామ మరాండీ అనే గిరిజన వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. సల్కు మరాండీ, పూలమణి మరాండీ అనే ఇద్దరు భార్యలు. వారిద్దరూ పరస్పరం తిట్టుకుంటున్నారు. ఇద్దరు భార్యలు ఇలా తిట్టుకోవడం, కొట్టుకోవడంతో భర్త విసుగెత్తిపోయాడు. ఈ క్రమంలో తన ఇద్దరు భార్యలను హత్య చేశాడు. ఓ సుత్తి తీసుకుని వారిద్దరినీ కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఓ చెట్టుకు వేలాడుతున్న శ్యామా మరాండీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అతడి ఇంటికి వెళ్లి చూడగా ఇద్దరు భార్యల మృతదేహాలు కనిపించాయి.
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading