మంత్రాలు చేసిందని గొడ్డలితో నరికి.. తలను చేతిలో పట్టుకుని..

మంత్రాలతో రోగాలునయం చేస్తుందని పేరున్న నందిని పుత్రి(62) అనే వృద్ధురాలి దగ్గరకు కజిన్‌ను తీసుకెళ్లాడు. తన కజిన్‌ను బాగు చేయాలని కోరగా, వృద్ధురాలు స్పందించడంతో వారిద్దరూ ఆనందంగా ఇంటికి వెళ్లారు.

news18-telugu
Updated: July 17, 2020, 6:30 AM IST
మంత్రాలు చేసిందని గొడ్డలితో నరికి.. తలను చేతిలో పట్టుకుని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
క్షణాల్లో నింగికేగేంతటి అత్యాధునిక సమాజంలోనూ కొంతమంది మూఢనమ్మకాలను వీడడం లేదు. ఇంకా మంత్రాలు, మూఢనమ్మకాలంటూ వాటినే పట్టుకు కూర్చుకుంటున్నారు. ఓ యువకుడు తన కజిన్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఓ వృద్ధురాలు మంత్రాలతో రోగాలు నయం చేస్తుందని తెలిసి ఆమెను సంప్రదించాడు. ఆమె దగ్గరికి కజిన్‌ను తీసుకుని యువకుడు వెళ్లాడు. ఆ వృద్ధురాలు బాగు చేస్తానని చెప్పడంతో వారిద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. కానీ కొద్దిరోజులకే ఆ వ్యక్తి చనిపోవడంతో యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ వృద్ధురాలు మంత్రాలు చేయడం వల్లే చనిపోయాడంటూ ఆమెను గొడ్డలితో నరికాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. తలను చేతిలో పట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని ఛతారా గ్రామానికి చెందిన కార్తీక్ కెరాయి(30) అనే యువకుడి కజిన్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

దీంతో మంత్రాలతో రోగాలునయం చేస్తుందని పేరున్న నందిని పుత్రి(62) అనే వృద్ధురాలి దగ్గరకు కజిన్‌ను తీసుకెళ్లాడు. తన కజిన్‌ను బాగు చేయాలని కోరగా, వృద్ధురాలు స్పందించడంతో వారిద్దరూ ఆనందంగా ఇంటికి వెళ్లారు. అనంతరం కొద్దిగంటల్లోనే కార్తీక్ కజిన్ ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అతడిని కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల మొదటివారంలో మరణించాడు.

అయితే తన కజిన్‌ మరణానికి నందిని పుత్ర మంత్ర ప్రయోగమే కారణమని బలంగా నమ్మాడు. దీంతో కెరాయి బుధవారం రాత్రి వృద్ధురాలిపై గొడ్డలితో దాడి చేశాడు. మొండెం నుంచి తలను వేరు చేసి.. తలను చేతిలో పట్టుకుని దనగాడి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 17, 2020, 6:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading