మనలో చాలా మంది ప్రేమ వివాహలకు (Love marriage) ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రేమించుకుంటే.. ముందే అన్నిరకాలుగా ఒకర్నిమరోకరు తెలుసుకొవచ్చని అనుకుంటున్నారు. ఒక వేళ నచ్చకపోతే.. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ కూడా చేప్పేస్తున్నారు. అయితే.. కొందరు ప్రేమను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. అవసరాలు తీరిపోయాక అవాయిడ్ చేస్తున్నారు. మరికొందరు దీనికి భిన్నంగా ప్రేమించిన వారికోసం ఏంచేయడానికైన వెనుకాడటం లేదు.
తమ లవర్ (lover) కళ్లలో ఆనందం కోసం నిరంతరం తపిస్తున్నారు. మరికొందరు తాము ప్రేమించిన వారి కోసం త్యాగాలు చేస్తే.. ఇంకొంత మంది ప్రేమించిన కూడా కట్నాలు, కానుకలు అంటూ అమ్మాయిలను వేధిస్తున్నారు. దీంతో తాము కోరుకున్న వారు దొరక్క యువతీ యువకులు సూసైడ్ చేసుకొవడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఘటన న వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఒడిశాలోని (Odisha) భువనేశ్వర్ లో షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా.. ఉండే సౌమ్యజిట్ మోహపాత్ర, శ్వేత ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. శ్వేత.. తను పెళ్లి చేసుకొవాలని సౌమ్య జిత్ ను కోరింది. అయితే.. పెళ్లి జరగాలంటే రూ. 30 లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నాడని తెలిపారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. అయితే.. పెళ్లి విషయంపై మాట్లాడటానికి ఇద్దరు పబ్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్యదూరం పెరిగింది.
ఈ క్రమంలో శ్వేత తీవ్ర మానసిక వేదనకు లోనైంది. ఈ క్రమంలో శనివారం అతనితో ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నించింది. అతను ఎంత సేపటికి కాల్ ఆన్సర్ చేయలేదు. దాదాపు.. 15 సార్లు అతగాడి ఫోన్ కు ట్రైచేసింది. అతను ఫోన్ ఎత్తక పోయే సరికి గదిలో వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో సెక్యురిటీ సిబ్బంది వచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించారు.
ఎంతసేపటికి తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు, అన్న అక్కడికి చేరుకున్నారు. ప్రియుడి కట్నం వేధింపుల వల్లనే తన కూతురు సూసైడ్ చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Love affair, Lovers suicide, Odisha