HOME »NEWS »CRIME »odisha locals tonsure couple after man visits womans home police begins probe ms

ఒడిశాలో దారుణం : ఏకాంతంగా గడుపుతున్న జంటకు గుండు కొట్టి..

ఒడిశాలో దారుణం : ఏకాంతంగా గడుపుతున్న జంటకు గుండు కొట్టి..
యువతికి గుండు కొడుతున్న స్థానికులు (Image : Twitter/ANI)

ఈ నెల 22న ఆ యువకుడు ఆమెను కలిసేందుకు యువతి ఇంటికి వచ్చాడు. ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు వారిపై దాడికి పాల్పడ్డారు.

  • Share this:
    ఒడిశాలోని మయూర్‌భంజ్‌ తాలుకా మండువా గ్రామంలో దారుణం జరిగింది. ఓ యువతి, యువకుడు ఏకాంతంగా గడపడాన్ని తప్పు పడుతూ స్థానికులు వారిపై దాడి చేశారు.విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు రోడ్డు పైనే గుండు గీయించారు. శనివారం నాడు ఈ ఘటన జరిగింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నెల 22న ఆ యువకుడు ఆమెను కలిసేందుకు యువతి ఇంటికి వచ్చాడు. ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు వారిపై దాడికి పాల్పడ్డారు. రోడ్డు పైకి లాక్కొచ్చి అందరి ముందు గుండు గీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.





    Published by:Srinivas Mittapalli
    First published:June 25, 2019, 10:19 IST