హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ఇంట్లో సీలింగ్ కు వేలాడుతూ.. పోక్సో న్యాయమూర్తి అనుమానస్పద మృతి

Shocking: ఇంట్లో సీలింగ్ కు వేలాడుతూ.. పోక్సో న్యాయమూర్తి అనుమానస్పద మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Odisha: న్యాయమూర్తి తన ఇంట్లో నుంచి ఎంత సేపటికి బయటకు రావడం లేదు. ఇంతలో ఆయన ప్రత్యేక స్టెనో గ్రాఫర్ అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో వెళ్లి చూసి షాక్ కు గురయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

ఒడిశాలో (Odisha) విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కటక్ లోని పోక్స్ న్యాయమూర్తి సుభాష్ కుమార్ బిహారీ (49) తన అధికారిక నివాసంలో విగతజీవిగా కన్పించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, దీనిపై ఆయన స్టెనోగ్రాఫర్ రబీ నారాయణ్ తనతో ఉదయాన్నే న్యాయమూర్తి తో మాట్లాడారని, శుక్రవారం సెలవు దరఖాస్తు రాయమని అన్నారని తెలిపాడు. ఇంతలోనే ఆయన తన అధికారిక నివాసంలో విగతజీవిగా కన్పించారు. ఇంట్లోని సీలింగ్ కు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. ఆయన మెడపై గాయం గుర్తులు ఉన్నాయని కటక్ నగరం పోలీసులు గుర్తించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అతని పిల్లలు పాఠశాలకు వెళ్లగా, భార్య ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రోజుకు పెద్దగా పని లేకపోవడంతో ఇంటికి వెళ్లాలని కోరినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మరణానికి గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించనప్పటికీ, దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా, ఇది ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా సెలవులో ఉన్న న్యాయమూర్తి శుక్రవారం విధుల్లో చేరాల్సి ఉంది.

న్యాయమూర్తి స్టెనోగ్రాఫర్, రబీ నారాయణ్ మహాపాత్ర మాట్లాడుతూ, అతను ఉదయం తనకు ఫోన్ చేసి, శుక్రవారం సెలవు దరఖాస్తు రాయమని అడిగాడు. న్యాయ అధికారి జాజ్‌పూర్ జిల్లాకు చెందినవాడు మరియు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక న్యాయమూర్తి అనుమానస్పదరీతిలో చనిపోవడం తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా  ఉండగా మధ్యప్రదేశ్‌లో (Madhya pradesh)  అమానుష ఘటన జరిగింది.

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కోసం ఎదురుచూసి చివరికి తల్లి చేతుల్లోనే ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు అనేక ఆస్పత్రులు,వాటిలో ప్రత్యేక చేశాయి. అయితే.. ఏర్పాటు చేసిన ప్రభుత్వాసుపత్రులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడి వైద్యులు, సిబ్బందిని మాత్రం బాగు చేయలేకపోతున్నారు. ప్రభుత్వ దవాఖానాలలో ఉద్యోగం చేస్తునే మరికొన్ని ఆస్పత్రులలో పని చేస్తుంటారు.

జబల్‌పూర్ జిల్లాలో వున్న ఓ ప్రభుత్వాసుపత్రికి ఓ తల్లి అనారోగ్యంతో వున్న తన ఐదేళ్ల బిడ్డను తీసుకొచ్చింది. అయితే డాక్లర్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది కాసేపు ఆగమని చేయమని చెప్పారు. దీంతో చేసేది లేక గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఎదురుచూసింది. సమయం గడుస్తున్నా ఒక్క డాక్టర్ కూడా సమయానికి హాజరుకాలేదు. చివరికి వైద్యం అందక ఆ పసిబిడ్డ తల్లి చేతుల్లోనే కన్నుమూశాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Odisha

ఉత్తమ కథలు