ఒడిశా (Odisha)హెల్త్ మినిస్టర్ నబా కిషోర్ దాస్(Naba kishore das)ను తుపాకీతో కాల్చాడు ఓ ఏఎస్‌ఐ(ASI). జార్సుగూడ(Jharsuguda)జిల్లా బ్రజ్‌రాజ్‌నగర్‌లో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిపై పోలీస్ కాల్పులు జరపడంతో మంత్రి అక్కడే కుప్పకూలిపోయారు. నబా కిషోర్‌దాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మంత్రికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిపారు. అయితే కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ ఆరోగ్యశాఖ మంత్రిపై ఎందుకు కాల్పులు జరపడనే విషయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
మంత్రిపై పోలీస్ కాల్పులు..
సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రిపైనే కాల్పులు జరిపాడు ఓ పోలీస్ అధికారి. ఒడిశాలోని జార్సుగూడ జిల్లా బ్రజ్‌రాజ్‌నగర్‌లో ఈ వార్త కలకలం రేపింది. ఒడిశా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నబా కిషోర్ దాస్ ఆదివారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అక్కడే కాపు కాచుకొని ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ మంత్రి కారులోంచి దిగగానే రివాల్వర్‌తో ఐదు, ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈఘటనలో మంత్రికి బుల్లెట్ గాయాలు కావడంతో కుప్పకూలిపోయారు.
మినిస్టర్ కండీషన్ సీరియస్..
వెంటనే ఆయన భద్రత సిబ్బంది, ఇతర పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. హెల్త్ మినిస్టర్ నబా కిషోర్ దాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రిపై దాడి చేసిన ఏఎస్‌ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రిపై కాల్పులు జరపడానికి కారణం ఏమై ఉండవచ్చని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి కాల్పులు జరిపిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Odisha news