TikTok | ఓరి వీళ్ల వేషాలోయ్... పసిపిల్లల ఐసీయూలో నర్సుల టిక్ టాక్ వీడియో...

మల్కాన్ గిరి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన నలుగురు నర్సులు విధుల్లో ఉండగానే ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ద్వారా హిందీ పాటలపై వీడియోలు చేశారు. అంతే కాదు వార్డులోని చంటి పిల్లలను ఎత్తుకొని వీడియోలు తీశారు.

news18-telugu
Updated: June 26, 2019, 10:06 PM IST
TikTok | ఓరి వీళ్ల వేషాలోయ్... పసిపిల్లల ఐసీయూలో నర్సుల టిక్ టాక్ వీడియో...
టిక్ టాక్ వీడియో
  • Share this:
ఒడిషాలోని మల్కాన్ గిరి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నర్సుల ప్రవర్తన శృతి మించింది. పసిపిల్లలకు అత్యవసర వైద్య సేవలు అందించే ఐసీయూలో నలుగురు నర్సులు టిక్ టాక్ వీడియోలు తీసి అప్ లోడ్ చేయడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే మల్కాన్ గిరి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన నలుగురు నర్సులు విధుల్లో ఉండగానే ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ద్వారా హిందీ పాటలపై వీడియోలు చేశారు. అంతే కాదు వార్డులోని చంటి పిల్లలను ఎత్తుకొని వీడియోలు తీశారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సర్వత్రా వివాదం అవుతున్నాయి. దీనిపై టిక్ టాక్ లో ఉన్న నర్సులు నందినీ రే, రూబీ రే, తాపసి బిస్వాస్, జ్యోతీ రేలకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే నర్సులు పసిపిల్లల అత్యవసర వార్డులో విధులు మరిచి ఈ విధంగా చేయడం పట్ల నెటిజన్లు మండి పడుతున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమడటం పట్ల పసిపిల్లల తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మల్కన్ గిరి చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజిత్ మొహంతి తెలిపారు. ఇదిలా ఉంటే ఇదే ఆసుపత్రిలో 2016లో అక్యూట్ ఎన్ సెఫలైటిస్ సిండ్రోమ్ తో సుమారు 103 మంది పసిపిల్లలు కన్నుమూసిన సందర్భంలో ఈ ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. అలాగే మొత్తం 125 బెడ్ల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో పిల్లల బెడ్ల సంఖ్య సరిపోకపోవడంతో గతంలో నేలపై పడుకోబెట్టినట్లు వార్తలు సైతం వచ్చాయి.



First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు