హోమ్ /వార్తలు /క్రైమ్ /

సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రాని పెళ్లి కొడుకు.. మోసం చేసినట్లు ఎట్లా అవుతుంది.. ట్విస్ట్ ఏంటంటే..

సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రాని పెళ్లి కొడుకు.. మోసం చేసినట్లు ఎట్లా అవుతుంది.. ట్విస్ట్ ఏంటంటే..

బిజయ్ శంకర్ దాస్, సోమాలిక (ఫైల్)

బిజయ్ శంకర్ దాస్, సోమాలిక (ఫైల్)

Odisha: కాలేజ్ రోజుల నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు చనువుగా తిరిగే వారు. రోజు కలుసుకునే వారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి యువతిని పట్టించుకోవడం లేదు.

కొందరు యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలకు గాలం వేస్తున్నారు. వారిని ముగ్గుల్లోకి లాగి, మాయమాటలు చెబుతున్నారు. అమ్మాయిలతో అడ్డమైన తిరుగుళ్లు తిరిగి, వారిని పెళ్లి చేసుకుంటామని చెప్పి శారీరకంగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత.. పెళ్లి అనగానే ముఖం చాటేస్తున్నారు. తమ కులం వేరని, ఇంట్లో ఒప్పుకొవడం లేదని, కట్నం డిమాండ్ చేస్తు అమ్మాయిలను పట్టించుకొవడం లేదు. ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తునే ఉంటాం. మరోక అమ్మాయి, ప్రేమ పేరుతో మోస పోయిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలో (Odisha)  ఒక రాజకీయ నాయకుడు, సోమాలిక దాస్ అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. అమ్మాయిని మోసం చేసుకుంటానని చెప్పి, ఆమెను శారీరకంగా లొంగ దీసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపింది. ఒడిశాలోని తిర్డోక్ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ కాలేజ్ రోజుల నుంచి ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచుగా కలుసుకునే వారు. ఈ క్రమంలో యువతి.. అబ్బాయి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో అతను కొద్ది రోజులుగా ముఖం చాటేశాడు. దీంతో యువతి.. పెద్దల దగ్గరు తన పంచాయతీని తీసుకెళ్లింది.

తనతో ఉన్నఫోటోలను చూపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని తెలిపింది. ఈ క్రమంలో పెద్దలు, అమ్మాయిని పెళ్లిచేసుకొవాలని తీర్మానించారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అబ్బాయి తొలుత రిజిస్ట్రర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి అమ్మాయి తరపు వారు.. ఏర్పాటు చేశారు. అబ్బాయి కోసం ఎదురు చూడసాగారు. కానీ వరుడు టైమ్ కి పెళ్లికి రాలేదు. ఎంత సేపటికి ఫోన్ తీయలేదు. దీంతో సోమాలిక దాస్  మరోసారి మోసపోయానని (cheating)  గ్రహించి బాధితురాలు పోలీసులకు (Odisha Fiancée lodges FIR) ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

అయతే, ఎమ్మెల్యే వాదన మరో విధంగా ఉంది.. తన నియోజక వర్గంలో అనేక పనులు ఉన్నాయని, తన తల్లికి ఆరోగ్యం బాగాలేక పోవడం వలన రాలేక పోయాయని అన్నారు. రిజిస్ట్రర్ ఆఫీస్ లో పెళ్లికి నమోదు చేసుకున్నాక.. 90 రోజులలోపు ఎప్పుడైన పెళ్లి చేసుకొవచ్చని అన్నారు. తనకు ఇంకా 60 రోజులు సమయం ఉందన్నారు. ఇది మోసం చేసినట్లు ఎలా అవుతుందని అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

First published:

Tags: Crime news, Female harassment, Odisha

ఉత్తమ కథలు