Home /News /crime /

ODISHA COURT SENTENCES MINOR TO 10 YEARS IMPRISONMENT FOR MOLESTED TEEN PAH

Shocking: జాతరకు తీసుకెళ్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.. బెదిరించి అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Odisha: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన వాడని యువకుడి మాటలు నమ్మి.. మైనర్ బాలిక మోస పోయింది. ఆమెను జాతరకు తీసుకెళ్తానని చెప్పి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

Odisha Court Sentences Minor To 10 Years Imprisonment: ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో దారుణ ఉదంతం జరిగింది. జాతరకు తీసుకెళ్తానని చెప్పి ఒక బాలుడు..  బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గతంలో జరిగింది. తాజాగా, నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సమాజంలో.. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను (Molested on Woman) నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులలో మార్పులు రావడం లేదు. ఇప్పటికి మహిళలు, యువతులను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు.

ప్రస్తుతం సమాజంలో.. మహిళల భద్రత పెద్ద సమస్యగా మారింది. వారు.. స్కూళ్లలో, ఆఫీసులలో, బస్టాండులలో ప్రతి చోట వేధింపులకు గురౌతున్నారు. కొందరు కేటుగాళ్లు.. మహిళలను బస్టాండులలో, బస్సులలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను చూసుకుంటూ వెకిలీ చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల కన్నవారే.. తమ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

పసి పాపల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవరిని వదలడం లేదు. ఇక స్కూళ్లలోను తోటి బాలికలు అఘాయిత్యాల బారిన పడుతున్నారు. కొన్ని చోట్ల టీచర్ లే కామాంధులుగా మారగా, మరికొన్ని చోట్ల విద్యార్థులు కూడా పార్టీల పేరిట లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

పూర్తి వివరాలు.. ఒడిశాలోని కియోజంర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బాలుడు .. బాలికను జాతరకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పాడు. అతని మాయమాటలు నమ్మి.. ఆమె అతనితో వెళ్లింది. ఆ తర్వాత.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత.. వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 15, 2017న నేరం చేసినందుకు దోషికి పోక్సో న్యాయమూర్తి సుభాశ్రీ త్రిపాఠి ₹ 5,000 జరిమానా కూడా విధించారు. అత్యాచార బాధితురాలికి ₹ 4 లక్షలు పరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అదే విధంగా నిందితుడు.. జువైనల్‌లో 21 ఏళ్లు వచ్చే వరకు ఉండాలని ఆతర్వాత.. సాధారణ జైలుకు తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Minor girl raped, Odisha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు