రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నారని..! పిల్లలపై కనికరం కూడా లేకుండా..

కూటికి దిక్కులేని వాళ్లు పూట గడవకున్నా చేయలేని పనిని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు చేశారు. వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సొంత కొడుకుల అడ్డు తొలగించుకున్నారు.

news18
Updated: October 14, 2020, 5:59 PM IST
రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నారని..! పిల్లలపై కనికరం కూడా లేకుండా..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 14, 2020, 5:59 PM IST
  • Share this:
నవమాసాలు మోసి.. కని.. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే పిల్లల అడ్డు తొలగించుకోవాలని చూస్తే..! వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఆ పిల్లల బాధ్యతను మరిస్తే..! అవునూ.. మీరు చదువుతున్నది నిజమే. విచక్షణ లేని జంతువులు కూడా చేయలేని పనిని ఆధునికత ముసుగు వేసుకున్న నాగరికులు చేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్గిరి కి చెందిన తల్లిదండ్రులు వారి పిల్లల్ని అమ్ముకున్నారు. అయితే వారికి తిండి పెట్టలేకో లేక చదువు చెప్పించలేకో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ జంట పిల్లల్ని అమ్మింది వేరే పెళ్లి చేసుకోవడానికి. వారిరువురు విడిపోయి వేరే వాళ్లతో కలిసుండటానికి ఈ దారుణానికి ఒడిగట్టారు.

వివరాల్లోకెళ్తే... ఒడిశాలోని గిరిజన జిల్లా మల్కాన్గిరికి చెందిన సుక్రా భూమియా, అతని భార్యకు ఇద్దరు కుమారులు. ఒక బాలుడికి తొమ్మిదేండ్లు కాగా.. మరోకరికి ఐదేండ్లు. అయితే ఆ తల్లిదండ్రులిద్దరికి పొసగక ఇరువురు విడిపోవాలనుకున్నారు. వారిరువురు వేరే పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్నారు. కానీ వారికి ఈ ఇద్దరు చిన్నారుల బాధ్యత గుర్తొచ్చింది. వారి భారాన్ని తెంచుకోవడానికి గానూ.. ఆ పిల్లలిద్దరినీ అమ్మకానికి పెట్టారు. ఇద్దరినీ అమ్మారు. వేరే కాపురాలు పెట్టుకున్నారు.

కానీ పెద్దబ్బాయి బసుదేవ్ కష్టాలు అక్కడితో అయిపోలేదు. అతడిని కొన్న కొత్త తల్లిదండ్రులు.. బసుదేవ్ నొక పాలేరు కంటే హీనంగా చూశారు. పొద్దంతా పశువులను మేపడం అతడి పని. తీరా ఇంటికొస్తే సరిగా తిండి కూడా దొరకలేదు. దీంతో ఆ బాధలు భరించలేక పిల్లోడు అక్కడ్నుంచి పారిపోయాడు. హింసను భరించలేక దగ్గర్లోని అంగన్వాడీ కేంద్రానికి పారిపోయాడు. బసుదేవ్ అంగన్వాడీలో ఉన్న విషయం అతడిని కొనుగోలు చేసిన వ్యక్తికి తెలిసింది. దీంతో అక్కడికి చేరుకుని అతడిని తిరిగి పంపాలని ఆ యజమాని బెదిరించాడు. అంగన్వాడీ కార్యకర్త జయంతితో వాగ్వాదానికి దిగాడు. కాగా, జయంతి ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. విచా రణ సందర్భంగా బసుదేవ్ తమ్ముడు కూడా వేరే వాళ్లకు అమ్మబడిన విషయం బయటపడింది. దీంతో అధికారులు వారిరువురిని ఒకచోటకి చేర్చారు.

అనంతరం బసుదేవ్ మాట్లాడుతూ.. ‘మేము ఇక్కడే చదువుకుంటాము. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను. మా గ్రామానికి తిరిగి వెళ్లడానికి తిరిగి ఆసక్తి లేదు’ అని చెప్పాడు. అయితే వీరిని అమ్మిన తల్లిదండ్రుల జాడ మాత్రం తెలియరాలేదు. ఇదే విషయమై చైల్డ్ లైన్ సభ్యురాలు ఒకరు మాట్లాడుతూ... బసుదేవ్ తండ్రి అతడిని విక్రయించినట్టు మాకు ఫోన్ రావడంతో మేం రెస్క్యూ ఆపరేషన్ చేశాం. ఆ బాలురిద్దరిని రక్షించి వారి బాగోగులు చూసుకుంటున్నాం. ఆ పిల్లవాడు కోరితే వారి బంధువుల దగ్గర విడిచిపెడతామని, లేకుంటే తామే మంచివిద్యను అందిస్తామని తెలిపారు. వారి తల్లిదండ్రలు బిడ్డలను అమ్మిన విషయం మీద దర్యాప్తు చేస్తున్నామని ఆమె వివరించారు.
Published by: Srinivas Munigala
First published: October 14, 2020, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading