news18-telugu
Updated: September 29, 2020, 5:14 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మానవత్వానికి మచ్చ తెచ్చే ఉదంతమిది. కంప్యూటర్ యుగంలోనూ ఆటవిక రాజ్యం నడుస్తోందనటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో యువకుడికి అనాగరిక శిక్ష విధించారు గ్రామస్తులు. అతడి పురుషాంగానికి ఇటుకను కట్టి వేలాడదీశారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలియాపాల్ మండలం చౌముఖ్ గ్రామానికి చెందిన బిక్రమ్ దాస్ (పేరు మార్చాం)కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐనప్పటికీ అదే గ్రామానికి చెందిన మరో మహిళలతో కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడూ ఆమె ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఏదో పని మీద వెళ్తున్నాడని గ్రామస్తులు మొదట భావించారు.
కానీ ఆ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలోనే అతడు వెళ్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వీరి మధ్యన ఏదో జరుగుతోందని భావించి వచ్చి నిఘాపెట్టారు. అలా కొన్ని రోజులు చూసిన తర్వాత వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని నిర్ధారణకు వచ్చారు. బిక్రమ్ను ఎలాగైనా పట్టుకొని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని శిక్ష విధించాలని వ్యూహం రచించారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆదివారం కూడా ఆ మహిళ ఇంటికి వెళ్లాడు బిక్రమ్. ప్లాన్ వర్కవుట్ కావడంతో.. గ్రామస్తులు అతడిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని.. అతడిని చితకబాదారు. అనంతరం ఊరి మధ్యలో కరెంట్ స్తంభానికి కట్టేసి ఇష్టానుసారం కొట్టారు.
అంతటితో ఆగలేదు. మానవత్వానికి మచ్చతెచ్చేలా.. మనిషన్నవాడు సిగ్గుపడేలా.. దారుణమైన అనాగరిక శిక్షను విధించారు. గ్రామస్తులందరి ముందే బిక్రమ్ దుస్తులు విప్పించారు. ఓ ఇటుకకు తాడుకట్టి అతడి మర్మాంగానికి వేలాడ దీశారు. ఇటుక చిన్నది కాదు. 5 కేజీల బరువు ఉంటుంది. అంతటి బరువైన ఇటుకను మర్మాంగానికి వేలాడదీయడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. 'కాళ్లు మొక్కుతా.. ఈ తప్పు మళ్లీ చేయను' అని ప్రాధేయపడినా వదిలిపెట్టలేదు. అక్కడున్న ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొన్ని గంటల పాటు అలాగే ఉంచారు. చివరకు ఓ గ్రామ పెద్ద కలగజేసుకొని బిక్రమ్ను వదిలిపెట్టాడు. గ్రామస్తులను మందలించి అక్కడి నుంచి పంపించారు.
యువకుడికి విధించిన ఈ దారుణమైన శిక్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఒడిశాలో దుమారం రేపుతోంది. ఇంత దారుణాలు జరుగుతున్నా ఏం చేస్తున్నారని.. అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. బాధితుడు గానీ.. అతడి కుటుంబ సభ్యులు గానీ.. తమ వద్దకు రాలేదని వెల్లడించారు. ఐతే వీడియో ఆధారంగా గ్రామస్తులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
September 29, 2020, 5:06 PM IST