Home /News /crime /

ODIA TV ACTOR ARRESTED FOR CHEATING GIRLFRIEND WITH MARRIAGE PROMISE PVN

TV Actor Arrest :పెళ్లి చేసుకుంటానని యువతితో శారీరక సంబంధం..ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్

ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్

ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్

TV Actor Arrested For Cheating Girlfriend : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సుమన్ శారీరక సంబంధాన్ని పెంచుకున్నాడని ఆ మహిళ ఫిర్యాదులో తెలిపింది. . రెండేళ్లకుపైగా తనతో ప్రేమ వ్యవహారం నడిపి,శారీరకంగా కూడా దగ్గరై ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు నటుడు ఒప్పుకోలేదని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇంకా చదవండి ...
TV Actor Arrested For Cheating Girlfriend : పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్ల్ ఫ్రెండ్ ను మోసం చేసిన కేసులో ప్రముఖ ఒడియా టీవీ నటుడు(TV Actor) ఎమ్ సుమన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. యువతి ఫిర్యాదు మేరకు సుమన్ ని ఒడిషాలోని మహలా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా,బాధిత యువతి తన ఫిర్యాదులో... సుమన్ కుమార్ తాను రెండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సుమన్ శారీరక సంబంధాన్ని పెంచుకున్నాడని ఆ మహిళ ఫిర్యాదులో తెలిపింది. . రెండేళ్లకుపైగా తనతో ప్రేమ వ్యవహారం నడిపి,శారీరకంగా కూడా దగ్గరై ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు నటుడు ఒప్పుకోలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సుమాన్‌ కుమార్‌ను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత అరెస్ట్‌ చేశారు. అతనిపై ఐపీసీ 376 (2)(n),420, 294,323తో పాటు 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Arrested, Girl friend, Odisha

తదుపరి వార్తలు