• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • OCCULTS POOJA PERFORMED AT SRIKALAHASTI KALABHAIRAVA TEMPLE SB

శ్రీకాళహస్తిలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం

శ్రీకాళహస్తిలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం

ప్రతీకాత్మక చిత్రం

అమావాస్య రోజున ఆలయంలో క్షుద్రపూజలు జరగడంతో స్థానికులుు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.

 • Share this:
  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడాంలో ఉన్న కాలభైరవ ఆలయంలో అర్థరాత్రి కొందరు క్షుద్రపూజలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఐదుగురు పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల సంగతిని తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంలో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్‌ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అమావాస్య రోజున ఆలయంలో క్షుద్రపూజలు జరగడంతో స్థానికులుు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: