షాకింగ్: హోటల్ గదిలో సీక్రెట్ కెమెరా... లైవ్ వీడియోలో భార్యభర్తలు

ఐపి కెమెరా అనే ఆప్షన్ కనిపించింది. దీంతో అతడికి అనుమానం వచ్చింది. అయితే బార్కర్ ఐటీ ప్రొఫషనల్ కావడంతో ... అక్కడెక్కడో సీక్రెట్ కెమెరా ఉన్నట్లు గుర్తించాడు.

news18-telugu
Updated: April 8, 2019, 10:34 AM IST
షాకింగ్: హోటల్ గదిలో సీక్రెట్ కెమెరా... లైవ్ వీడియోలో భార్యభర్తలు
హోటల్ గదిలో సీక్రెట్ కెమెరాలు
news18-telugu
Updated: April 8, 2019, 10:34 AM IST
ఈ మధ్య హోటల్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టే సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. దక్షిణ కొరియాలో 800మంది సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటనలు మరువకముందే... న్యూజిలాండ్‌లో ఓ జంటకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వీళ్లు ఎయిర్‌బీఎన్‌బీ అనే యాప్ ద్వారా హోటల్ రూమ్‌ను బుక్‌ చేసుకున్నారు. భార్యభర్తతో పాటు ఐదుగురు పిల్లలు కూడా హోటల్‌లో దిగారు. అయితే భర్త బార్కర్ రూంలో... వైఫై కనెక్ట్ చేద్దమని ఫోన్ తీశాడు. దీంతో అతడికి ఐపి కెమెరా అనే ఆప్షన్ కనిపించింది. దీంతో అతడికి అనుమానం వచ్చింది. అయితే బార్కర్ ఐటీ ప్రొఫషనల్ కావడంతో ... అక్కడెక్కడో సీక్రెట్ కెమెరా ఉన్నట్లు గుర్తించాడు. ఆ డివైస్ పోర్ట్స్‌ను స్కాన్ చేశాడు. లైవ్ వీడియో కనుగొన్నాడు. ఆ లైవ్ వీడియోలో రూంలో ఉన్న తన ఫ్యామిలీయే కనిపించడంతో షాక్ తిన్నాడు. రూం సీలింగ్‌లో కెమెరా పెట్టినట్లు గుర్తించాడు. వెంటనే వెళ్లి హోటల్ యజమానిని నిలదీశాడు. దీంతో యజమాని ఒక కెమెరా పెట్టినట్లు ఒప్పుకున్నాడు.

మా అనుమతి లేకుండా రూంలో ఎలా కెమెరా పెడతారంటూ ఎయిర్ బీఎన్‌బీ యాప్‌కు ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పిన యాప్ సంస్థ దీనిపై విచారన జరిపిస్తామంది. తమ లిస్ట్ నుంచి ఆ హోటల్‌ను తీసేస్తామని చెప్పింది. అయితే అక్కడ్నుంచి వేరే హోటల్‌కు షిప్ట్ అయిపోయింది బార్కర్ ఫ్యామిలీ. ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీ మాత్రం ఈ ఘటనపై ఎలాంటి విచారన చేపట్టలేదు.
ఈ మొత్తం ఘటనను బార్కర్ తన బ్లాగ్‌, ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అంతర్జాతీయంగా ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

దీంతో ఎయిర్‌బీఎన్‌బీ వెంటనే దిగొచ్చింది. కొన్ని కోట్ల మంది తమ కంపెనీ ద్వారా హోటళ్లను బుక్ చేసుకుంటున్నారని.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుతున్నాయని తెలిపింది. జరిగిన దానికి చింతిస్తున్నామని.. బార్కర్ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. వారు కట్టిన బిల్ కూడా రిఫండ్ చేస్తున్నామన్నారు. హోటల్‌ను తమ యాప్ నుంచి తీసేసినట్టు పేర్కొంది. ఏదైనా హోటల్ కెమెరాలను అమర్చితే ముందుగా కస్టమర్ల అంగీకారం తప్పనిసరి అని.. తమ వెబ్‌సైట్‌లో కూడా ఇవే నిబంధలను పాటిస్తున్నట్టు ఎయిర్‌బీఎన్‌బీ చెప్పింది. ఏదీ ఏమైనా హోటల్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి దంపతుల లైవ్ వీడియోలు రికార్డ్ చేయడం టెలికాస్ట్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో చాలా చోట్ల కొత్త ప్రాంతాలకు వెళ్లి హోటల్‌రూంలో దిగాలంటేనే భయపడుతున్నారు జనం.ఇవికూడా చదవండి: 

ప్రియురాలిని కలుసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని, ఆమె భర్తను చంపిన ప్రియుడు...

‘భార్యల మార్పిడి’కి ఒప్పుకోలేదని కట్టుకున్నదానిపై భర్త దారుణం...

 
First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...