హోటల్ రూమ్‌లో నర్సింగ్ ఇంటర్న్‌ను రేప్ చేసిన డాక్టర్..

కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ ఇంటర్న్‌ను డాక్టర్ రేప్ చేశాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

news18-telugu
Updated: September 27, 2020, 7:15 AM IST
హోటల్ రూమ్‌లో నర్సింగ్ ఇంటర్న్‌ను రేప్ చేసిన డాక్టర్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ ఇంటర్న్‌ను డాక్టర్ రేప్ చేశాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. 25 ఏళ్ల నర్సు జూలై 25న ఓ న్యూరో సర్జన్ చేతిలో అత్యాచారానికి గురైనట్టుగా తెలిపింది. అయితే తన ఫిర్యాదుపై ఆస్పత్రి యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సెప్టెంబర్ 19న పోలీసులను ఆశ్రయించింది. "జూలై 15 డాక్టర్ నన్ను హాస్పిటల్ బయట కలవాలని రమ్మనాడు. ఎక్కడ కలవాలో అడ్రస్ కూడా ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగా విసన్ గార్డెన్‌కు వెళ్లాను. అక్కడి నుంచి అతను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నా బట్టలు తీసేసి, సెక్సువల్‌గా వేధించాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత సెక్సువల్‌గా అతనికి సహకరించాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వీడియో కాల్స్ ద్వారా, అసభ్యకర మెసేజ్‌ల ద్వారా నన్ను వేధించాడు" అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఇక, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ డాక్టర్‌పై రేప్, సెక్సువల్ వేధింపులు, బెదిరింపులు, మోసంకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆ డాక్టర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ప్రస్తుతం అతను అక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతను తిరిగి బెంగళూరు రాగానే అతని అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: September 27, 2020, 6:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading