Home /News /crime /

ప్రేమపేరుతో మోసం: డాక్టర్‌పై యాసిడ్ దాడి చేసిన లేడీ నర్స్ 

ప్రేమపేరుతో మోసం: డాక్టర్‌పై యాసిడ్ దాడి చేసిన లేడీ నర్స్ 

బాధితురాలు (File)

బాధితురాలు (File)

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ డాక్టర్ మీద నర్సు యాసిడ్ దాడి చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆమె కోర్టు ఆవరణలోనే అతనిపై యాసిడ్ ‌పోసింది.

    అమ్మాయి తనను ప్రేమిచడం లేదంటూ హైదరాబాద్‌లో మధులిక అనే యువతిని ఓ యువకుడు అత్యంత దారుణంగా కొడవలితో దాడి చేశాడు. గతంలో కూడా అమ్మాయిలు తమను ప్రేమించలేదన్న కోపంతో కొందరు యువకులు వారిపై యాసిడ్ దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే, ఈ కేసు టోటల్ రివర్స్. తనను ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి.. లవర్ మీద యాసిడ్ దాడి చేసింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఈ ఘటన జరిగింది. ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడం విశేషం.

    love couple commits suicide in asifabad
    ప్రతీకాత్మక చిత్రం


    తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా పనిచేస్తున్న ఆదర్శ్ రెడ్డి, నర్సుగా పనిచేస్తున్న అరుణకుమారి మధ్య వివాహేతర సంబంధం కొన్నినెలల పాటు కొనసాగింది. అరుణకుమారి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే గత నెలరోజుల నుంచి అరుణకుమారిని ఆదర్శ్ రెడ్డి దూరం పెట్టడంతో ఆమె మనస్థాపానికి గురైంది. మరోవైపు ఆదర్శ్ రెడ్డి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.

    Crime, Tamilnadu, poison in Alcohol, brothers died for Love Failure, Love Failure Crimes Suicides, లవ్ ఫెయిల్యూర్ మందులో విషం, మద్యంలో విషం విషయం తెలియన ప్రేమ ఆత్మహత్యలు
    నమూనా చిత్రం


    ఉదయం 10గంటల సమయంలో తిరుపతి నగరంలోని కోర్టుకు వచ్చిన ఆదర్శ్ రెడ్డిపై ఒక్కసారిగా అరుణకుమారి యాసిడ్ దాడికి దిగింది. ముఖానికి చున్నీ కట్టుకుని యాసిడ్ దాడికి పాల్పడింది. యాసిడ్ దాడి నుంచి ఆదర్శ్ రెడ్డి తృటిలో తప్పించుకున్నాడు. బాటిల్ లో మిగిలిన యాసిడ్ ను తాగేసింది అరుణకుమారి. హుటాహుటిన అరుణకుమారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Video : ప్రేమపేరుతో మోసం: డాక్టర్‌పై యాసిడ్ దాడి చేసిన లేడీ నర్స్
    First published:

    Tags: Crime, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు