Home /News /crime /

Extramarital Affair: ఫోన్ దొంగలించాడు.. ఆమె భర్తకు అందులో ఉన్న ఫోటోలు వీడియోలు పంపాడు.. చివరికి ఏం జరిగిందంటే..?

Extramarital Affair: ఫోన్ దొంగలించాడు.. ఆమె భర్తకు అందులో ఉన్న ఫోటోలు వీడియోలు పంపాడు.. చివరికి ఏం జరిగిందంటే..?

నర్స్ ఫోన్ చోరీ

నర్స్ ఫోన్ చోరీ

Extramarital Affair: పోయిన ఫోన్ ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేసింది. ఓ హాస్పిటల్ లో నర్సు తన పనిలో నిమగ్నమై మొబైల్ పోగుట్టుకున్న సంగతి గుర్తించ లేకోపోయింది. కానీ ఆ ఫోన్ దొంగలించిన వాడు.. ఊరికే ఉండకుండా.. ఆమె ఫోన్ లో ఉన్న సీక్రెట్ వీడియోలు.. ఫోటోలను ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో ఆమె కాపురం ఇప్పుడు బజారున పడింది..

ఇంకా చదవండి ...
  Extramarital Affair:  స్మార్ట్ ఫోన్ లతో మంచి సంగతి అటుంచితే.. కాపురాలే కూలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా పోన్ లో రహస్యాలు పెట్టుకుంటే ప్రమాదం తప్పదని ఓ ఘటన హెచ్చరించేలా చేసింది. తాజాగా ఓ నర్సు అలాంటి కష్టాన్ని ఎదుర్కొంటోంది. ఫోన్ పోయింది.. పరువు పోయింది.. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది. కాపురం కూలిపోయే ప్రమాదం వచ్చిందని కన్నీరు పెడుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగందంటే.. ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తున్న ఒకామె.. ఎప్పటిలాగే ఓ రోగికి సేవలు చేస్తోంది. పనిలో నిమగ్నమైన ఆమె.. తన ఫోన్ దొంగతనానికి గురైందనే సంగతి గమనించలేకపోయింది. కానీ ఆ పోయిన ఫోన్ తన జీవితాన్ని బజారుపాలయ్యేలా చేస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ఆ ఫోన్ ను దొంగలించిన వాడు చేసిన పనితో ఆమె కాపురం కూలిపోయే ప్రమాదంలో పడింది. మొత్తం కుటుంబ సభ్యుల అందరి మధ్య దోషిగా నిలబడాల్సి వచ్చింది..

  పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకరాం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో సదరు నర్సు పనిచేస్తోంది. అక్కడ కొన్ని రోజుల కిందట ఒక పేషెంట్ రావడంతో పనిలో ఉండగా.. ఆమె మొబైల్‌ను ఎవరో చోరీ చేశారు. ఎంతగా వెతికినా తన మొబైల్ దొరకలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చేది.. సరే ఫోన్ ఎవరికో దొరికి ఉంటుంది.. పోయింది అనుకుని ఇంక ఆ ఫోన్ వదిలేసుకుంది. ఆ పోయిన ఫోన్ తన జీవితాన్ని ఇలా కష్టాల పాలు చేస్తుందని ఆమె ఊహించలేకపొయింది..

  ఇది చదవండి:  ఆ పని మానలేక.. కన్న పిల్లల్ని నేలకేసి కొట్టిన తండ్రి.. రెండేళ్ల పసిపాప మృతి

  ఫోన్ పోయిన రెండ్రోజుల తర్వాత ఆమె భర్తకు ఆమె మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో అవతల వ్యక్తి చెప్పిన మాటలు విని ఆ భర్తకి గుండె ఆగినంత పనైంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే..‘‘మీ భార్య ఫోన్లో కొన్ని అసభ్యకరమైన ఫొటోలు ఉన్నాయి. ఆస్పత్రిలో ఎవరితోనో కలిసి ఉన్న అశ్లీల వీడియోలు కూడా కనిపించాయి. వాటన్నింటినీ పంపుతా చూడు’’ వెంటనే ఆ ఆ దొంగ ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలతో షాకైన ఆ భర్త ఇంకా షాక్ నుంచి తేరుకోక ముందే వరుసగా ఫొటోలు, వీడియోలను వాట్సప్ లో షేర్ చేశాడు. దీంతో అతడికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. అక్కడితోనే ఆ దొంగ ఆగలేదు. ఆ ఫోన్ లో ఉన్న నర్సు ఫ్యామిలీ గ్రూపులు.. సన్నిహితులు అందరికీ.. అలాగే అందులో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లకు ఆ వీడియోలను, ఫోటోలను షేర్ చేశాడు.

  ఇది చదవండి: ఒడిషా బోర్డర్ లో మావోయిస్టుల ఎదురుదాడి.. ఇద్ద‌రు పోలీసుల‌కు గాయాలు

  ఇంతకాలం అందరితో మంచిదానిలా నటిస్తూ.. చేస్తున్న పనులు ఇవా అంటూ ఆ కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇంతకాలం తనతో ఉన్న భార్య ఇలాంటిదా? అంటూ భర్త.. చుట్టాలు అందరూ ఆమెపై నిప్పులు కురిపించారు. కుటుంబం ఆమెను ఇంటి నుంచి బయటకు తరిమేసేలా ఉంది. నర్సు కుటుంబం.. ఆమె భర్త కుటుంబాల మధ్య రణరంగాన్ని తలపిస్తోంది. కుటుంబ సభ్యులందరి నుంచి అవమానాలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆమె మాత్రం.. తనకు ఆ ఫోటోలు, వీడియోలతో ఎలాంటి సంబంధం లేదని.. ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవంటూ మహారాజపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరి ఆ దొంగ ఆమెకు తెలిసినవాడేనా.. లేక కావాలని ఆమెను ఏడిపించేందుకు సైకోలా బిహేవ్ చేస్తున్నాడా.. లేక నిజంగానే ఆమె ఫోన్ లో అవన్నీ ఉన్నాయా అన్నది ఇప్పుడు పోలీసులే తేల్చాలి..
  చోరీ తర్వాతే అసలు కథ..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Crime news, Extra marital affair, Extramarital affairs, Madhya pradesh

  తదుపరి వార్తలు