మంచి ఉద్యోగం రావడంతో ఆ యువతి ఎంతో సంతోషపడింది. తమ కష్టాలు తీరాయని, ఇక నుంచి ఆనందంగా ఉండొచ్చని కలల కనింది. ఎన్నో ఆశలతో కొత్త డ్యూటీకి వెళ్లింది. ఐతే విధుల్లో చేరిన తొలిరోజే.. ఆమె జీవితంలో చివరి రోజయింది. కొందరు దుండగులు ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. యూపీలోని ఉన్నావ్‌లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దోయ్-ఉన్నావో రోడ్డులోని దుల్లాపూర్వా గ్రామంలో ఏప్రిల్ 25న న్యూజీవన్ ఆస్పత్రి ప్రారంభమయింది. స్థానిక ఎమ్మెల్యే ఆ ప్రైవేట్ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. అవివాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఆ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఏప్రిల్ 39న తొలి రోజు డ్యూటీ చేసేందుకు వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజయింది.
Delhi : ఆరు నెలల పసిపాపపై అత్యాచారం.. మతిస్థిమితంలేని ఆమె అక్కను కూడా.. ఢిల్లీలో దారుణం
ఆ యువతి ఇంతకు ముందు సఫీపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఏడాదిన్నర పాటు నర్సుగా పనిచేసింది. ఆ తర్వాత న్యూజీవన్ ఆస్పత్రిలో ఉద్యోగ వచ్చింది. శుక్రవారమే విధుల్లో చేరింది. ఆ రోజు డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఆస్పత్రి ఆపరేటర్ నూర్ ఆలం ఆమెతో మాట్లాడాడు. మీరు కొత్త కదా.. ఏమీ తెలిసి ఉండకపోవచ్చు.. నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పాడు. కాసేపయ్యాక నా డ్యూటీ ముగుస్తుందని.. ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పడంతో.. ఆ యువతి అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత నూర్ ఆలమ్ మరో ముగ్గురు వ్యక్తులను పిలిపించాడు. ఐదుగురు కలిసి యువతిని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం మెడకు చున్నీ బిగించి... హత్య చేశారు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని ఆస్పత్రి భవనంపై ఉన్న ఓ ఇనుప చువ్వకు వేలాడదీశారు.
Crime News:సినిమా కాదు నిజం.. రైల్వే స్టేషన్‌లో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై అఘాయిత్యం
శనివారం తెల్లవారుఝామున కొందరు వ్యక్తులు యువతి మృతదేహాన్ని చూసి భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిచ్చెన సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. ఆమెది హత్యే అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆస్పత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ యువతి అదే రోజు డ్యూటీకి వచ్చిందని.. విధుల్లో చేరిన తొలి రోజే ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి ఆపరేటర్ నూర్ ఆలం, చాంద్ ఆలం, అనిల్‌తో పాటు మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. నిందితులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ దినేష్ త్రిపాఠి తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని కీలక వివరాలు తెలిసే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang rape, Rape and murder, Up news, Uttar pradesh