Gang rape on nurse : కఠిన చట్టాలు అమలులో ఉన్నా కొన్ని మానవ మృగాలు వాటిని ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఏ భయమూ లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిపి గ్రామంలో ఆరోగ్య కేంద్రంలోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్న నర్సును కట్టేసి సామూహిక అత్యాచారానికి(Nurse Gang Raped )పాల్పడ్డారు. ఆరోగ్య కేంద్రం(Health Centre)లో ఒంటరిగా పనిచేస్తున్నట్లు గుర్తించి నర్సుపై అత్యాచారానికి పాల్పడ్డారు. నర్సుని కట్టేసి, గొంతును బిగించి ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
నలుగురు నిందితులు ఘటనను తమ ఫోన్ లో రికార్డ్ చేసి,పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తామని నర్సుని బెదిరించారు. బాధిత నర్సు జరిగిన ఘటనను తన తల్లిదండ్రులకు చెప్పుకొని వాపోయింది. కుటుంబసభ్యుల సహకారంతో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు. నిందితులలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి నిమేష్ బరయ్య తెలిపారు.
Shoking : సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై 10మంది సామూహిక అత్యాచారం!
నిందితుల్లో 17 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురిని అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా,ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ భూపేష్ భఘల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఇదేసమయంలో ఆరోగ్య కార్యకర్తలు.. తమకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. "మాకు రక్షణ కావాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే, మేము పని చేయము" అని జిల్లా ఆరోగ్య కేంద్రంలోని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Crime news, Gang rape