Nurse, husband arrested for stealing cash: ఢిల్లీలోని పోష్ అమ్రుతా షెర్గిల్ మార్గ్ లో భారీ దొంగతనం జరిగింది. నమ్మించి పని ఇచ్చినందుకు, ఇంట్లో వారినే మోసం చేశారు. ఈ క్రమంలో.. ఆమె కోసం ఇంట్లో ఆసరాగా కొంత మంది పనివాళ్లను నియమించారు. ఢిల్లీలో అపర్ణా రూత్ విల్సన్ అనే నర్స్ ను.. ఢిల్లీలోని షేర్గిల్ మార్గ్ లోని ఉన్న ఇంట్లో అత్తగారికి ఆసరాగా ఉంటుంది. ఆమె అత్తగారి ఆరోగ్యంను చూసుకుంటూ ఉంటుంది. వీరిని.. సోనమ్ అత్త పూర్తిగా నమ్మారు. అయితే, ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న దాదాపు.. 2.4 కోట్ల విలువ చేసే నగదు, బంగారం మాయమయ్యాయి.
ఈ క్రమంలో.. ఆమె వారిపై అనుమానం వ్యక్తం చేశారు.ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి వీరు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బ్రందాలతో విచారణ చేపట్టారు. బుధవారం రోజున.. అపర్ణ రూత్ విల్సన్ ను, ఆమె భర్త నరేష్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నరేష్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తుండేవాడు. ఆ సమయంలో సోనమ్ కపూర్, ఆమె భర్త స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సోనమ్ ఇంట్లో దాదాపు.. 20 మంది పనివాళ్లు ఉన్నట్లు అధికారుల విచారణలో తెలింది. వీరిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. చోరికి గురైన నగదు, బంగారం ఇంకా రికవరీ కాలేదని తెలిపారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ తల్లి కాబోతోంది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేసిన విషయం తెలిసిందే.
Guard Your Lemons Thieves Steal 60 Kg From Godown in UP: ఉత్తర ప్రదేశ్ లోని గోడౌన్ లో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. షాహజాన్ పూర్ ప్రాంతంలో ఉన్న మొహల్లా అనే వ్యాపారి గోడౌన్ లో అతని కూరగాయలు పెట్టే వాడు. ఇలా ప్రతి రోజు కూరగాయాలను విక్రయించి మిగిలిన వాటిని దాంట్లో పెడుతుండేవాడు. ప్రస్తుతం నిమ్మ కాయ ధరలు ఆకాశాన్ని చేరుకున్నాయి. దీంతొ వీటికి విపరీతంగా డిమాండ్ వచ్చింది. ఒక రోజు మొహల్లా గౌడోన్ కు వెళ్లి చూడగా షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ తాళలు పగులగొట్టి ఉన్నాయి. ఎవరో చోరీకి పాల్పడ్డారని అనుకున్నాడు. అనుకున్నట్లే దొంగలు.. నిమ్మకాయలను చోరీ చేశారు.
తన గోడౌన్ నుంచి దాదాపు 60 కేజీల నిమ్మకాయలు చోరి అయినట్లు గుర్తించాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత వారం నుంచి వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.