హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆన్ లైన్ క్లాసుల పేరుతో చాటింగ్.. రాత్రికి రాత్రే ప్రియుళ్లతో ఎస్కేప్.. ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో తెలిస్తే..

ఆన్ లైన్ క్లాసుల పేరుతో చాటింగ్.. రాత్రికి రాత్రే ప్రియుళ్లతో ఎస్కేప్.. ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో తెలిస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు తల్లిదండ్రులు కొని ఇస్తోంటే పిల్లలేమో పోకిరీల ప్రలోభాలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు పొలాల్లో కూలీ పనులకు వెళ్తున్న సమయంలో విద్యార్థులు ఫోన్ లో ఇతర కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు.

ప్రేమో ఆకర్షను తెలియని వయసు అడ్డు అదుపులేని సెల్ ఫోన్ వాడకం టీవీల ప్రభావం బాలికల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మైనర్ తీరని వయసులో ఏది తప్పో? ఏది ఒప్పో? తెలుసుకోలేని అమాయక ఆడపిల్లలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువకుల ప్రలోభాలకు గురై ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. కరోనా కాలంలో బడులు మూతపడడం, ఇంటి వద్ద తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటం లాంటి కారణాలు బాలికల బంగారు భవిష్యత్తుపై దెబ్బ కొడుతున్నాయి. ప్రేమ పేరుతో ఏటా చాలామంది అదృశ్యమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా ఇలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయి. దీనికితోడు అనేకమంది వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రత్యేక కథనం.

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ తరగతులతో విద్యార్థులపై ఫోన్లు టీవీల ప్రభావం ఎక్కువ అయింది. పాఠాలు వినడంతో పాటు ఫోన్ లో వచ్చే అశ్లీల సందేశాలు కార్యక్రమాలు అనుకోకుండా తెరపై కనిపించడంతో వాటిని వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు తల్లిదండ్రులు కొని ఇస్తోంటే పిల్లలేమో పోకిరీల ప్రలోభాలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు పొలాల్లో కూలీ పనులకు వెళ్తున్న సమయంలో విద్యార్థులు ఫోన్ లో ఇతర కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఉన్న చిన్నారులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక పెడదారి పడుతున్నారు. ఆకర్షణ వలలో పడి తాజాగా ఆరుగురు బాలికలు అదృశ్యం అయ్యారు. అంతకుమించే బాలికలు అదృశ్యం అయినా చాలా మంది మాత్రం పరువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

ఉదాహరణకు నారాయణపేట మండలంలోని కోటకొండ బండ గుండ గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు ఇటీవల ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మరొకరు ధన్వాడ మండలం లోని గ్రామానికి చెందిన యువతి ఇటీవలే అదృశ్యం అయింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు చిన్నారులు ఇటీవల ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొల్లాపూర్ మండలంలోని రెండు గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు యువకుల వలలో పడి ఇంటి నుంచి పరారయ్యారు. నారాయణపేట మండలంలోని అమ్మి రెడ్డి పల్లి కి చెందిన బాలిక ఇటీవలే రాత్రిపూట ఇంటి నుంచి అదృశ్యమైంది. నారాయణపేట జిల్లా లోని మద్దూర్ మండలంలోని దుప్పటి ఘాట్ రేనివాట్ల లో బాలికలు ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క సంవత్సరంలోనే నారాయణపేటలో జిల్లాలో 91 కేసులు, మహబూబ్ నగర్ జిల్లాలో 47, వనపర్తిలో 5, నాగర్ కర్నూల్ జిల్లాలో 14, జోగులాంబ గద్వాలలో 30 మంది దాకా బాలికల అదృశ్యం కేసులు కావడం జరిగింది. ఏది ఏమైనా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పిల్లల వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Mahabubnagar, Telangana, Wife kill husband

ఉత్తమ కథలు