Home /News /crime /

NTR DAUGHTER UMA MAHESWARI COMMITTED SUICIDE AT HOME SB

Ntr Daughter: షాకింగ్.. ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ కూతురు.. !

ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి

ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి

జూబ్లీ హిల్స్‌లో ఆమె ఇంటిలోనే.. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా కటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు.

    స్వర్గీయ ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాసేపటి క్రితమే.. ఆమె హఠాత్తుగా చనిపోయినట్లు.. వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె... ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  జూబ్లీ హిల్స్‌లో ఆమె ఇంటిలోనే.. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.  అయితే ఈ విషయాన్ని  కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.  ఈ ఘటనపై ఎవరూ  స్పందించలేదు.

    ఇప్పటికే పోలీసులు జూబ్లిహిల్స్‌లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఎపుడూ చాలా చురుగ్గా ఉండే ఉమామహేశ్వరి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది తెలియడం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. అక్కడ పోస్ట్‌ మార్టమ్‌ నిర్వహించిన తర్వాతే..  ఆమె ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు అందే అవకాశముంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏం వచ్చింది? ఆరోగ్య సమస్యల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.



    ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. వీళ్ళలో కొందరు మనకు తెలుసు హరికృష్ణ , బాలకృష్ణ హీరోలుగా మారిన విషయం సైతం అందరికి తెలిసిందే. ఇక కూతుళ్లు, భువనేశ్వరి, పురంధేశ్వరి గురించి కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ మరో కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరీ.

    అయితే అందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్నా.. చిన్నకూతురు ఉమామహేశ్వరి జీవితం మాత్రం చాలా విషాదంగా నిండింది. ఉమామహేశ్వరిని నరేంద్ర రాజన్ అనే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసాడు ఎన్టీఆర్. అయితే అయన చాలా సాడిస్ట్ గా బిహేవ్ చేసేవాడని, సిగరేట్ తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి వాళ్ళ నాన్న అయినా ఎన్టీఆర్ కి చెప్పింది. దీంతో అతడితో విడాకులు ఇప్పించి ఇంకో వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు ఎన్టీఆర్.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: NTR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు