ఎవరైనా ప్రైజ్ మనీ (Prize Money) గెలిస్తే సంతోషిస్తారు.. దాని వల్ల లాభం వస్తుంది. కానీ అతనికి ఆ ప్రైజ్‌మనీనే ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. దేశం కాని దేశంలో ఎంతో కష్టపడి సీఈఓ స్థాయికి ఎదిగిన వ్యక్తి ప్రైజ్ మనీ కారణంగా ఓ దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికా న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో జరిగింది. అమెరికా (America)లో భారతీయ సంతతికి చెందిన శ్రీరంగ అరవపల్లి దారుణ హత్య (Murder)కు గురయ్యారు. దోపిడీ చేసుందుకు ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అరవపల్లిపై కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. న్యూజెర్సీ (New Jersey) లోని ప్లెయిన్స్‌బోరో (Plainsboro) లో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. కాగా..నిందితుడిని జాన్ రీడ్‌గా పోలీసులు గుర్తించారు.
ఏం జరిగింది..
అమెరికా (America) లో భారతీయ సంతతికి చెందిన శ్రీరంగ అరవపల్లి ప్రముఖ ఫార్మా కంపెనీలో సీఈఓగా పని చేస్తున్నాడు. అతని వయసు 54 ఏళ్లు ఔరెక్స్ లేబొరేటరీస్ పేరుతో 2014 నుం చి ఫార్మా సం స్థను నడుపుతున్నారు.
అక్టోబర్ 26, 2021న శ్రీరం గ అరవపల్లి అర్ధరాత్రి దాటాక ఓ క్లబ్లో క్యా సినో ఆట ఆడాడు. ఇందులో ఆయన పది వేల డాలర్లు గెలుచుకున్నారు. అనంతరం సంతోషంగా ఇంటికి బయల్దేరాడు. అయితే అరవపల్లి ఇంత ప్రైజ్‌మనీనీ గెలుచుకోవడం చూసిన దుండగుడు అతన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. దాదాపు 80 కిలోమీటర్లు దుండగుడు శ్రీరంగ అరవపల్లిని ఫాలో అయ్యాడు. శ్రీరంగ ఇంటి వరకూ దుండగుడు ఆయనను అనుసరించాడు. ఆయన ఇంట్లోకి వెళ్లిన వెంటనే.. దుండగుడు మాత్రం ఇంటి వెనుకవైపు ఉన్న కిటిలోంచి లోపలికి ప్రవేశించి..అరవపల్లిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో అరవపల్లి భార్య కూతురు పైనున్న గదిలో నిద్రపోతున్నారు.
నిందితుడిని పట్టుకొన్నపోలీసులు..
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అరవపల్లిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్టు ఆస్పత్రిలో వైద్యులు (Doctors) ధృవీకరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జెకాయ్ రీడ్ జాన్(27) అనే వ్య క్తిని నిం దితుడిగా గుర్తిం చారు. అంతడనిఇ పెన్సిల్వేనియాలో అరెస్టు చేశారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, NRI, NRI News, United states