కన్న వారు తమ పిల్లలకు మంచి జీవిత భాగస్వామి దొరకాలని కోరుకుంటారు. దీని కోసం తెలిసిన వారిని, మ్యాట్రిమోనియల్ సైట్లు, పెళ్లిళ్ల పేరయ్యలను సంప్రదిస్తుంటారు. కూతుళ్లు ఉన్న తల్లిదండ్రులైతే తమ కూతురు వెళ్లే వారి ఇంట్లో ఏ లోటు లేకుండా మహారాణిలా ఉండాలని భావిస్తుంటారు. దీనికోసం కొందరు వయసు ఎక్కువవుతున్న ఏమాత్రం పట్టించుకోరు. నచ్చిన సంబంధం (Marriage) దొరికే వరకు ఎదురు చూస్తుంటారు. కొంత మంది ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు. తమ అల్లుడు విదేశాలలో ఉన్నాడని గొప్పగా చెప్పుకొవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పెళ్లిని ఎంతో వైభవంగా జరిపిస్తారు.
కట్నకానుకలు (Dowry) ఎంత ఇవ్వడానికి కైన వెనుకాడరు. అయితే,కొన్ని సార్లు.. ఎన్ఆర్ఐ అల్లుళ్లు మొదట బాగానే ఉన్నా.. ఆ తర్వాత వారి వంకర బుద్ధిని బయట పెడుతుంటారు. ఇంకా కట్నం కావాలని, నువ్వు నచ్చలేదని చెబుతూ భార్యను (Harassment) వేధిస్తుంటారు. దేశంకానీ దేశంలో కట్టుకున్న భార్యకు చిత్ర హింసలకు గురిచేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. తాజాగా మధ్య ఆఫ్రికా దేశంలో భర్త చేతిలో మహారాష్ట్రలోని (maharashtra) థానే జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ టార్చర్ అనుభవిస్తుంది. బాధితురాలికి ఏడాది క్రితం ఒక ఎన్ఆర్ఐ (NRI marriage) వివాహమైందని. ఈ క్రమంలో అక్కడి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త పెళ్లయిన నాటి నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఆమెకు మొబైల్ ఫోన్ ఇవ్వకపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా బంధించాడు. దీంతో బాధితురాలు భారత్లోని తన తల్లిదండ్రులతో మాట్లాడలేక పోయింది.
అయితే ఇంటిలో పనిమనిషి సాయంతో ఎట్టలకు తన తల్లికి వీడియో కాల్ చేసిన బాధితురాలు గోడును (Husband Assaults) వెళ్లబోసుకుంది. దీంతో వెంటనే బాధితురాలి తల్లి ఆఫ్రికా దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అక్కడి అధికారులు బాధితురాలి ఇంటికి ఘటనపై ఆరా తీశారు. యువతిని భరోసా సెల్ అనే స్వచ్చం సంస్థ ద్వారా తిరిగి ఆమె స్వస్థలానికి చేర్చారు. దీంతో మహిళ జూన్ 9 న తిరిగి థానే చేరుకుందని భరోసా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Dowry harassment, Female harassment, Maharashtra