హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: పార్కులో ఘోరం.. స్నేహితుడిని నమ్మి వెళ్లిన మహిళ.. ఇంత ఘోరం చేస్తాడని ఊహించలేదు..

OMG: పార్కులో ఘోరం.. స్నేహితుడిని నమ్మి వెళ్లిన మహిళ.. ఇంత ఘోరం చేస్తాడని ఊహించలేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: స్నేహితుడితో కలిసి పార్కుకు వెళ్లింది. అక్కడ ఆమె పట్ల కొందరు దుర్భాషలాడారు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించారు.

మహిళల భద్రత, వేధింపులను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, కొందరు కామాంధులలో మాత్రం మార్పులు రావడం లేదు. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతునే ఉన్నారు. పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చిన వీరు మారటం లేదు. ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని  (uttar pradesh) నోయిడాలో దారుణం జరిగింది. ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి రాత్రి పూట పార్కుకు వెళ్లింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు ఉన్నారు. అయితే, తన స్నేహితుడు ముందస్తు ప్రణాళికతో అత్యాచారం జరిగినట్లు మహిళ ఫిర్యాదు చేసింది. నోయిడాలోని (Park) పార్కులో.. మహిళ, తన స్నేహితుడు రంజిత్ తో కలిసి సరదాగా వెళ్లింది. అక్కడ అప్పటికే పంకజ్, పవన్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారు మహిళను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత మహిళ వారు అక్కడి నుంచి పారిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత.. బాధితురాలు తన ఇంట్లో వారికి జరిగిన విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. బాధితురాలు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పంకజ్,రంజీత్ లను అరెస్టు చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు ఘజియాబాద్ కు చెందిన వారిగా తెలుస్తోంది.

న్యూఢిల్లీ లో (Delhi) సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన కల్కాజీ ప్రాంతంలో మే 14 జరిగింది. కల్కాజీలో ఒక అపార్ట్ మెంట్ లో దంపతులు ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరికి మధ్య తరచుగా గొడవలు జరుగుతు ఉండేవి. దీంతో స్వర్ణాలి ఘోష్ తన భర్త మీద పీకలదాక కోపం పెంచుకుంది. అప్పటికే స్వర్ణాలి ఘోష్.. భర్తకు తెలియకుండా మోహన్ పాల్ తో రెండెళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.

ఈ క్రమంలో తన ప్రియుడికి (Lover) భర్త వేధింపులను చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి అతడిని హతమార్చాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ఇంట్లో ఉన్న వ్యక్తిపై, భార్య, స్వర్ణాలి ఘాష్, మోహన్ పాల్ కత్తితో దాడిచేశారు. ఆమె కదలకుండా గట్టిగా పట్టుకుంటే ప్రియుడు, వివాహిత భర్తను హత్య చేశాడు. ఆ తర్వాత.. మోహన్ పాల్ వెస్ట్ బెంగాల్ పారిపోయాడు. అయితే, ఇతని శవాన్ని ఇంటి ముందర పడేశారు. ఎవరో గుర్తు తెలియని దుండుగులు చంపేశారని చెప్పడానికి ప్లాన్ వేశారు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోనికి దిగారు. మహిళ చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. ఆమె కాల్ డాటాను చూశారు. తమదైన రీతిలో విచారించగా తానే.. నేరాన్ని చేసినట్లు అంగీకరించింది. ఆ తర్వాత పోలీసులు, వివాహిత ప్రియుడు మోహన్ లాల్ ను వెస్ట్ బెంగాల్ లో అరెస్టు చేశారు.

First published:

Tags: Female harassment, Harassment, Uttar pradesh