హెల్మెట్ ధరించనందుకు ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు 500 రూపాయల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే నోయిడాలో ఓ ప్రైవేట్ బస్సు యజమాని నిరంకర్ సింగ్‌కు రవాణా శాఖ అధికారులు ఈనెల 11న ఇ - చలాన్ పంపించారు. అయితే విచిత్రంగా హెల్మెట్ లేకుండా బస్సు నడిపినందుకు తనకు చలానా విధించినట్లు తనకు వచ్చిన నోటీసులో ఉంది. దీనిపై ఆయన ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు తాను కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. అయితే, ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ తప్పు తమ వల్ల జరిగింది కాదని, చలాన్ పంపింది రవాణా శాఖ అధికారులని చెప్పారు.
గతంలో ఇదే బస్సుకు సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగా నాలుగు సార్లు జరిమానా విధించినట్లు వారు చెప్పారు. అయితే నిరంకార్ సింగ్ మాత్రం సీట్ బెల్ట్ నిబంధన ఉల్లంఘన అని చలాన్‌లో రాయాలి తప్ప హెల్మెట్ ధరించలేదని ఎలా రాస్తారని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.