Home /News /crime /

స్పా సెంటర్ అడ్డాగా వ్యభిచార దందా.. 14 మంది అమ్మాయిలతో యాపారం.. చివరకు ఊహించని షాక్..!

స్పా సెంటర్ అడ్డాగా వ్యభిచార దందా.. 14 మంది అమ్మాయిలతో యాపారం.. చివరకు ఊహించని షాక్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నోయిడాలో వేవ్ మాల్ అనే పేరుతో ఓ మాల్ ఉంది. దీంట్లో ఫేమస్ స్పా కూడా ఉంది. దీంట్లోకి కొందరు వ్యక్తుల రాకపోకలు అనుమానాస్పదంగా ఉండటంతో హోటల్ సిబ్బందిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమచారాన్ని అందించారు. పోలీసులు ఆ స్పా లోపలికి వెళ్తే..

ఇంకా చదవండి ...
    సిటీలోని పెద్ద మాల్. అందులో స్పా సెంటర్.. రాత్రిపూట సడన్ గా పదుల సంఖ్యలో పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఎవరో సినీ ప్రముఖులో, రాజకీయ నాయకులో ఆ హోటల్ వద్దకు వచ్చి ఉంటారని అంతా భావించారు. వారికి సెక్యూరిటీగా వచ్చి ఉంటారని ఊహించారు. కానీ ఆ పోలీసుల్లో కొందరు బయట ఉండగా, మరికొందరు లోపలికి వెళ్లారు. నేరుగా స్పా సెంటర్లోకి వెళ్లారు. మొత్తానికి ఓ స్పెషల్ ఆపరేషన్ తో ఓ భారీ సెక్స్ రాకెట్ నే అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పట్టణంలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్ లో జరిగిందీ ఘటన. ఒకరిద్దరు కాదు, ఏకంగా 14 మంది అమ్మాయిలను, 18 మంది విటులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నోయిడాలో వేవ్ మాల్ అనే పేరుతో ఓ మాల్ ఉంది. దీంట్లో ఫేమస్ స్పా కూడా ఉంది. దీంట్లోకి కొందరు వ్యక్తుల రాకపోకలు అనుమానాస్పదంగా ఉండటంతో హోటల్ సిబ్బందిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమచారాన్ని అందించారు. ఆ వ్యక్తి అందించిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు ఆ స్టార్ హోటల్ వద్దకు చేరుకున్నారు. నేరుగా స్పా సెంటర్లోకి వెళ్లారు. మొత్తానికి 14 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మరో 18 మంది విటులను, వ్యభిచార నిర్వాహకులను కూడా పోలీసులు పట్టేశారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించి, విటులను, వ్యబిచార నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నోయిడా పోలీసు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

    ’మాకు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు మాల్ లోని స్పా సెంటర్ పై దాడులు నిర్వహించాం. పెద్ద సంఖ్యలో అమ్మాయిలను, విటులను, వ్యభిచార నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమిక విచారణలో అమ్మాయిలంతా బాధితులేనని తేలింది. దీంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించాం. వారి వివరాలు కనుక్కుని, వారి వారి స్వస్థలాలకు పంపిస్తాం. ఈ ఆపరేషన్లో 18 మంది విటులు, వ్యభిచార నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశాం. వీరిపై కేసులు నమోదు చేస్తున్నాం.‘ అంటూ నోయిడా పోలీసులు వెల్లడించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Husband kill wife, Viral Video, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు