NOIDA BUS OWNER FINED FOR DRIVER NOT WEARING A HELMET BA
బస్సు డ్రైవర్‌కి హెల్మెట్ లేదని జరిమానా.. ఎంతంటే.
ఫ్రతీకాత్మక చిత్రం
అద్దె బస్సులను నడిపే డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా విధించారు. బస్సు నెంబర్ వేసి.. హెల్మెట్ లేదని జరిమానా వేయడంతో కంపెనీ సిబ్బంది దాన్ని చూసి అవాక్కయ్యారు.
ఇటీవల కాలంలో చలాన్ల మోత మోగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రవాణా చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి వీపు చలాన్ల మోత మోగిస్తున్నారు పోలీసులు. అయితే, ఇలాంటి సందర్భాల్లో కొన్ని విచిత్రాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి విచిత్రంలో ఇది కూడా ఒకటి. నోయిడాలో ఓ బస్సు డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా విధించారు. నోయిడాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీ.. బస్సులను అద్దెకు ఇస్తూ ఉంటుంది. ఆ అద్దె బస్సులను నడిపే డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా విధించారు. బస్సు నెంబర్ వేసి.. హెల్మెట్ లేదని జరిమానా వేయడంతో కంపెనీ సిబ్బంది దాన్ని చూసి అవాక్కయ్యారు.
సదరు కంపెనీకి సుమారు 80 బస్సులు ఉన్నాయి. రోజూ రోడ్ల మీద తిరిగే బస్సులు కావడంతో అవి ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయేమో చెక్ చేసుకునేందుకు, ఎప్పటికప్పుడు చలాన్లను సరిచూసుకునేందుకు ఓ ఉద్యోగిని నియమించుకున్నారు. ఆ ఉద్యోగి చలాన్లను చెక్ చేస్తుండగా ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది. వాహనం నెంబర్ చెక్ చేస్తే బస్సు అని ఉంది. కానీ చలాన్లో మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్నాడని పేర్కొన్నారు పోలీసులు. ఇలాంటివి ఇదొక్కటే కాదట. మూడు నెలల క్రితం ఒకే రోజు ఒకే బస్సుకు మూడు చలాన్లు విధించారట. అయితే, చలాన్లు ఎంతో చెప్పారే కానీ, అసలు వారు చేసిన తప్పేంటో మాత్రం చెప్పలేదని ఆ కంపెనీ ఉద్యోగి తెలిపాడు. అయితే, ఆన్లైన్లో నమోదు చేయడంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. కానీ, సదరు కంపెనీ బస్సులు చాలాసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తాయని, దానికి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.