బాస్‌ను కిడ్నాప్ చేసిన ఉద్యోగులు... కారణం ఏమిటంటే...

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని నెలలుగా తమకు జీతం ఇవ్వకుండా వేధిస్తున్న బాస్‌ను కిడ్నాప్ చేశారు ఉద్యోగులు. అతడిని కొన్ని రోజుల పాటు బంధించి హింసించారు.

  • Share this:
    తమకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వని బాస్ నుంచి ఎలాగైనా బకాయిలు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారు పలువురు. ఎన్నిసార్లు అడిగినా... ఏదో ఒక సాకు చెబుతూ తమ జీతాలు ఇవ్వకుండా తప్పించుకున్న బాస్‌ను కిడ్నాప్ చేయాలని డిసైడయ్యారు. చివరకు తాము అనుకున్నంతా చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని హలసురులో ఈ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల సుజయ్ కొంతకాలంగా ఓ ప్రైవేటు కంపెనీని నడిపిస్తున్నాడు. అయితే గత ఏడు నెలలుగా ఉద్యోగులు మాత్రం జీతాలు చెల్లించడం లేదు. దీంతో బాస్ నుంచి తమకు రావాల్సిన బకాయిలను ఎలాగైనా వసూలు చేయాలని నిర్ణయించుకున్న ఏడుగురు ఉద్యోగులు... బాస్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు.

    ఇందుకోసం పక్కాగా ప్లాన్ కూడా చేసుకున్నారు. గత నెల 21న సుజయ్‌ను కిడ్నాప్ చేసిన ఉద్యోగులు... అతడిని తమ స్నేహితుడి ఇంట్లో బంధించారు. తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని అతడిని హింసించారు. జీతాలు చెల్లిస్తానని సుజయ్ హామీ ఇవ్వడంతో అతడిని విడిచిపెట్టారు. అయితే తనను కిడ్నాప్ చేసిన ఉద్యోగులపై సుజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనకు సంబంధం ఉన్న నలుగురికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    First published: