నిజామాబాద్ జిల్లాలో యువతిపై ఆరుగురు గ్యాంగ్ రేప్, డబ్బులిస్తామని అర్ధరాత్రి తీసుకెళ్లి

ఆరుగురు యువకులు (అందులో ఇద్దరు మైనర్లు) రాత్రి సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. రాత్రి 1.30 గంటల సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో నిందితులు పారిపోయారు.

news18-telugu
Updated: August 27, 2020, 3:23 PM IST
నిజామాబాద్ జిల్లాలో యువతిపై ఆరుగురు గ్యాంగ్ రేప్, డబ్బులిస్తామని అర్ధరాత్రి తీసుకెళ్లి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి చెల్లెలికి ఆరోగ్యం సరిగా లేదు. ఆమెకు చికిత్స అందించేందుకు చెల్లెలిని నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ ఆమె పరిస్థితిని గమనించిన యువకులు, తమతో వస్తే ఆర్థిక సాయం చేస్తామన్నారు. దీంతో బాధితురాలు నమ్మి వారి వెంట వెళ్లింది. ఆరుగురు యువకులు (అందులో ఇద్దరు మైనర్లు) రాత్రి సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. రాత్రి 1.30 గంటల సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో నిందితులు పారిపోయారు. బిక్కుబిక్కుమంటున్న యువతిని చూసిన పోలీసులు ఆమెను ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆగస్టు 24వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. అనంతరం రెండు రోజుల్లో పోలీసులు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. తాను ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, అసలే ఆర్థికంగా సమస్యలో ఉంటే, తన సోదరికి అనారోగ్యం కారణంగా మరింత సమస్య వచ్చిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 27, 2020, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading