ఎన్ఐటి క్యాంపస్‌లో ప్రొఫెసర్ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది..?

Suicide in NIT Rourkela : సంఘటనా స్థలంలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో వివరాలను వెల్లడించినప్పటికీ.. ప్రాథమికంగా కొంత సమాచారం బయటకొచ్చింది. తమ పదేళ్ల వైవాహిక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో వెల్లడించినట్టు సమాచారం.

news18-telugu
Updated: August 19, 2019, 8:40 AM IST
ఎన్ఐటి క్యాంపస్‌లో ప్రొఫెసర్ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒడిశాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కెలా(NIT-R)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసు జయబాలన్(37), అతని
సతీమణి మాలిని(35) ఆత్మహత్య చేసుకున్నారు. అగస్టు 14వ తేదీ నుంచి వారు కనిపించకుండా పోవడంతో క్యాంపస్‌లోని కొంతమంది స్టూడెంట్స్ శుక్రవారం రాత్రి జయబాలన్ నివాసముంటున్న క్యాంపస్ క్వార్టర్స్‌ వద్దకు వెళ్లారు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపు తట్టారు. అయితే ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. లోపల లైట్స్ అన్నీ ఆన్‌ లోనే ఉన్నాయి. అనుమానం వచ్చిన విద్యార్థులు క్యాంపస్‌లోని సెక్యూరిటీని పిలిచారు. సెక్యూరిటీ సిబ్బంది కిచెన్ వైపు ఉన్న బాల్కనీలో నుంచి లోపలికి వెళ్లి చూశారు. లోపల రెండు మృతదేహాలు ఉండటంతో షాక్ తిన్నారు.

సంఘటనా స్థలంలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో వివరాలను వెల్లడించినప్పటికీ.. ప్రాథమికంగా కొంత

సమాచారం బయటకొచ్చింది. తమ పదేళ్ల వైవాహిక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో వెల్లడించినట్టు సమాచారం.అలాగే తమ ఆస్తుల వివరాలను కూడా అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడటానికి కొద్ది గంటల ముందు.. బ్యాంకుకు వెళ్లి తమ వద్దనున్న బంగారం మొత్తం లాకర్‌లో పెట్టేసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జయబలాన్,న్యూట్రిషనిస్ట్‌గా మాలిని సంతోషంగా జీవిస్తున్నారని.. ఇద్దరూ చాలా మంచివారని.. అలాంటిది ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని చుట్టుపక్కలవారు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు