హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gold Fraud: రూ. 10 లక్షలిస్తే రూ. 25 లక్షలు విలువజేసే బంగారం.. నిజామాబాద్​​ వాసికి కుచ్చుటోపీ పెట్టిన ఘారానా ముఠా

Gold Fraud: రూ. 10 లక్షలిస్తే రూ. 25 లక్షలు విలువజేసే బంగారం.. నిజామాబాద్​​ వాసికి కుచ్చుటోపీ పెట్టిన ఘారానా ముఠా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ ధరకే ఎక్కువ బంగారం ఇస్తామని ఆశ చూపి,  నమ్మించి నకిలి బంగారం అంటగట్టి డబ్బులు దండుకుంటున్న ఓ ముఠా గుట్టును నిర్మల్ జిల్లా భైంసా పోలీసులు రట్టు చేశారు.

(లెనిన్​ , News18, ఆదిలాబాద్​)

తక్కువ ధరకే ఎక్కువ బంగారం (Gold) ఇస్తామని ఆశ చూపి,  నమ్మించి నకిలి బంగారం అంటగట్టి (Gold Fraud) డబ్బులు దండుకుంటున్న ఓ ముఠా (gang) గుట్టును నిర్మల్ జిల్లా భైంసా పోలీసులు (Nirmal district Bhainsa police) రట్టు చేశారు. తొలుత కొంత అసలు బంగారాన్ని చూపి నమ్మించి, ఆ తర్వాత మొత్తం డబ్బులు తీసుకొని నకిలి బంగారాన్ని అంటగడుతున్నారు.  నిజామాబాద్ (Nizamabad) పట్టణానికి చెందిన కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తికి 25 లక్షల రూపాయల విలువ గల బంగారాన్ని కేవలం పది లక్షల రూపాయలకే ఇస్తామని నమ్మించి మోసం చేశారు.

ఎనిమిది లక్షల 50 వేల రూపాయలు తీసుకొని..

నిర్మల్ (Nirmal) జిల్లా తానూరు మండలానికి చెందిన  లావడే బాబు అనే వ్యక్తి మధ్య వర్తిగా ఉండి, నకిలి బంగారాన్ని విక్రయించే వ్యక్తులను పరిచయం చేశాడు. మొదట ఒక లక్ష 50 వేల రూపాయలను తీసుకొని రెండు గ్రాముల అసలు బంగారాన్ని శ్యాంపుల్ గా ఇచ్చారు. దాన్ని చూసి నమ్మి, మిగతా బంగారం కోసం ఎనిమిది లక్షల 50 వేల రూపాయలు తీసుకొని మహారాష్ట్ర లోని యవత్మాల్ కు వెళ్లిన కళ్యాణ్ కుమార్ నుంచి ఆ డబ్బును తీసుకొని నకిలి బంగారాన్ని (fake gold) అంటగట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత పరీక్షించడంతో అది నకిలీదని తేలింది. ఏదో లోహనికి బంగారు పూత పూసి ఉందని గ్రహించాడు.  మోసపోయానని (Gold Fraud) గ్రహించి  బాధితుడు భైంసా పట్టణ పోలీసులను ఆశ్రయించాడు.

ముఠాలో ఐదుగురు..

వెంటనే రంగంలోకిదిగిన పోలీసులు (Police) దర్యాప్తు చేపట్టి నకిలి బంగారం అంటగడుతూ డబ్బులు దండుకుంటున్న ముఠాలో ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. అందులో నుంచి తెలగ రవీంద్ర మహదేవ్ కఠారే, లావడే బాబు, బాలాజీ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి లక్షా 98 వేల రూపాయల నగదు, రెండున్నర గ్రాముల బంగారు గొలుసు, ఒకటిన్నర గ్రాముల ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులైన మతీన్, సలీం సగ్వన్ లు పరారీలో ఉన్నారు.


వెయ్యి రూపాయల కోసం క‌జిన్ బ్ర‌ద‌ర్ హత్య.. కామారెడ్డి​లో దారుణం.. మ‌ర్డ‌ర్ కేసును ఒక్క రోజులో చేధించిన పోలీసులు

నిందితులను,  నగదు, ఆభరణాలను భైంసా ఏఎస్పీ (ASP)  కిరణ్ కారే భైంసా పట్టణ పోలీస్ స్టేషన్ (Police station) లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులు మోసం చేసిన తీరును వివరించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకుని చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్.ఐ లను ఏఎస్పీ  కిరణ్ కారే అంభినందించారు.  ఇద్దరు కానిస్టేబుళ్లకు రివార్డును సైతం  కిరణ్ కారే అందజేశారు.

First published:

Tags: Adilabad, Crime news, Gold fraud, Nirmal, Nizamabad, Police arrest

ఉత్తమ కథలు