హోమ్ /వార్తలు /క్రైమ్ /

రేపు ఉరి ఉందనగా, నిర్భయ దోషుల తరఫు న్యాయవాది సరికొత్త ప్రతిపాదన...

రేపు ఉరి ఉందనగా, నిర్భయ దోషుల తరఫు న్యాయవాది సరికొత్త ప్రతిపాదన...

నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ (File)

నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ (File)

Nirbhaya Case | నిర్భయ కేసులో దోషులు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

Nirbhaya Case |  2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు (నిర్భయ కేసు)లో నలుగురు దోషులకు రేపు ఉరిశిక్ష అమలు కానుంది. ఉరి శిక్షను రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పాటియాలా కోర్టు కొట్టేసింది. దీంతో వారిని ఉరి తీయడం దాదాపు ఖాయమైంది. ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరితీయనున్నారు. ఉరికి మరికొన్ని గంటలే ఉందనగా, దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పుడు ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఈ కేసులో నలుగురు దోషులు దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని భారత్ - పాకిస్తాన్ సరిహద్దులకు పంపాలని, లేకపోతే భారత్ - చైనా సరిహద్దు అయిన డోక్లాంకు పంపాలని సూచించారు. అంతేకానీ, వారిని ఉరి తీయవద్దని కోరారు. ఈ మేరకు తాను అఫిడవిట్ ఫైల్ చేస్తానని ఏపీ సింగ్ ప్రకటించారు.

ఈనెల 5వ తేదీన నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ చేయడంతో ఏపీ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ల జారీ అనంతరం.. దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులను ఇప్పటికే నాలుగు సార్లు చంపేశారని..ఇంకెన్ని సార్లు చంపుతారని కోర్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 72ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.

First published:

Tags: Nirbhaya, Nirbhaya case

ఉత్తమ కథలు